Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైనాట్ 175 - విశాఖ నుంచి పాలన : మంత్రులకు సీఎం జగన్ దిశా నిర్దేశం..!?

నేటి కేబినెట్ భేటీలో విశాఖ నుంచి పాలన..రాజకీయ కార్యాచరణ పైన మంత్రులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్టీ జంపింగ్ లు మొదలయ్యాయి. పొత్తులు..యాత్రలతో వ్యూహాలు పదునుక్కుతున్నాయి. తిరిగి అధికారం లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్దమవుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండటంతో పాలనా - పార్టీ పరంగా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించనున్నారు. అందులో భాగంగా.. మంత్రులకు దిశా నిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నేడు సమావేశం కానున్నారు. అమరావతి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో విశాఖ నుంచి పాలన.. అసెంబ్లీ సమావేశాలతో పాటుగా రాజకీయంగానూ మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఈ రోజు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. సుప్రీంకోర్టులో మూడు రాజధానుల వ్యవహారం పైన ఈ నెల 23న విచారణ జరగనుంది. తీర్పు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తీర్పు ఆలస్యం అయితే.. వచ్చే నెల 22న ఉగాది నాడు విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభించే లా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాను త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లుగా ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. దీని పైన ముఖ్యమంత్రి ఈ భేటీలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైనా నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ లోపారిశ్రామిక సదస్సు జరగనుంది. మంత్రులు..అధికారులు ఆ సదస్సు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. దీంతో.. మార్చి 6వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీని పైన నిర్ణయం తీసుకోనున్నారు.

విశాఖ నుంచి పాలన..అసెంబ్లీ సమావేశాలు

విశాఖ నుంచి పాలన..అసెంబ్లీ సమావేశాలు

పాలనా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొద్ది నెలల క్రితం వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు తిరిగి నిర్మాణం పైన నేటి కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అదర్శ పాఠశాలలు..ఎడ్యుకేషన్ సొసైటీల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. రామాయపట్నం పోర్టులో జిందాల్ స్టీల్స్ కు క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనల పైన చర్చించనున్నారు. రాష్ట్ర పెట్టుబడల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖ కేంద్రంగా మార్చిలో జరిగే పార్టనర్ షిప్ సమిట్ .. జీ 20 సన్నాహక సదస్సు ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ రెండు అంతర్జాతీయ సదస్సులు కావటంతో.. ఈ సదస్సుల బాధ్యతల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీలు నియమాకం చేయనున్నారు.

పల్లె నిద్రకు సిద్దమవుతున్న సీఎం జగన్

పల్లె నిద్రకు సిద్దమవుతున్న సీఎం జగన్

కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత రాజకీయంగానూ సీఎం మంత్రులకు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. మార్చి 17న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ గడప గడపకు ప్రభుత్వం పైన వర్క్ షాపు నిర్వహించనున్నారు. అదే విధంగా టీడీజీ - జనసేన పొత్తు దాదాపు ఖరారు కావటం.. లోకేష్ పాదయాత్ర..త్వరలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభ సమయంలో పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాల పైన మంత్రులకు సీఎం మార్గ నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా సీఎం జగన్ త్వరలోనే పల్లెనిద్ర కార్యక్రమం ప్రారంభించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గ సహచరులతో చర్చించే అవకాశం ఉంది. మంత్రులు పాలనా - పార్టీ వ్యవహారాల పైన మరింత సమర్ధవంతంగా వ్యవహరించేలా సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+