Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-కులగణన, ఉద్యోగుల డీఏ, జర్నలిస్టుల ఇళ్లస్ధలాలసహా 38 అంశాలకు ఓకే..

ఏపీలో ఇవాళ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మొత్తం 38 అంశాలకు ఆమోద ముద్ర పడింది. ఇందులో రాష్ట్రంలో కులగణన నిర్వహణ, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఆమోదంతో పాటు పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు డీఏ పెంపుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న సురక్ష కార్యక్రమం అమలుపైనా కేబినెట్ చర్చించింది.

https://telugu.oneindia.com/news/india/chhattisgarh-election-congress-safe-hand-with-assurances-362001.html

ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాన అంశం రాష్ట్రంలో కులగణన. రాష్ట్రంలో బీసీల జనాభా తేల్చేందుకు కులగణన చేపట్టాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి కులగణన చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం ఇవాళ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల వేళ దేశంలో ఇండియా కూటమి కులగణన హామీ ఇస్తున్న వేళ వైసీపీ సర్కార్ కూడా దీని అమలుకు సిద్ధమవుతోంది. అణగారిన కులాల అభ్యున్నతికి కులగణన ఉపయోగపడుతుందని సీఎం జగన్ కేబినెట్ భేటీలో తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో 19 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల ప్రతిపాదనలకు తాజాగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 70 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అలాగే రాష్ట్రంలో జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున భూమి ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అటు దేవాలయాల ఆదాయ పరిమితుల ఆధారంగా కేటగిరీల్లో చేయబోయే మార్పులకు ఆమోదం తెలిపింది.

అలాగే టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 పోస్టు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న జననన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్ లో చర్చించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని మంత్రులు తెలిపారు. దీంతో కేబినెట్ దీనికి అభినందలు తెలిపింది. అలాగే ఇందులో మంత్రులు చురుగ్గా పాల్గొనాలని సీఎం జగన్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కర్నూలులో నేషనల్‌ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానం, కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల మినహాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు విద్యుత్‌పై రాయితీ వచ్చేందుకు ఆమోదం తెలిపింది.

పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్ల మున్సిపాలిటీకి చెందిన ఎకరం భూమి తనఖాపై కేబినెట్‌లో చర్చ జరిగింది. మున్సిపాలిటీలో రూ.8కోట్ల రుణ సేకరణకు అనుమతించాలని కేబినెట్‌కు పురపాలక శాఖ ప్రతిపాదించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+