ఏపీలో కొత్త జిల్లాల ముసాయిదా ఖరార్- కేబినెట్ ముందుకు..

Amaravati: ఏపీ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు దీనికి హాజరుకానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. పలు ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. అలాగే దాదాపుగా 50కి పైగా అంశాలను మంత్రివర్గం చర్చించనుంది. వాటికి సంబంధించిన కొన్ని తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది.

ఇందులో ప్రధానంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు, పరిశ్రమలకు భూముల కేటాయింపు, రాజధాని అమరావతి నిర్మాణంలో చోటు చేసుకుంటోన్న పురోగతి, అంతర్జాతీయ విమానాశ్రయం, క్వాంటం పాలసీ.. సాగరనగరం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లు.. వంటివి ఉన్నాయి. వీటిపై మంత్రులు క్షుణ్నంగా చర్చించనున్నారు. కొన్నింటిని ఆమోదించనున్నారు. అలాగే- కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

AP Cabinet to meet on today

ఏపీలో కొత్త జిల్లాలు దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. దీనిపై ఆరు నెలలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన ఓ ముసాయిదా కూడా సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు జిల్లాలు ఆవిర్భవిస్తాయనే ప్రచారం సాగుతోంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా గుర్తించనుంది ప్రభుత్వం. దీంతో పాటు మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదు.

క్వాంటం పాలసీని మంత్రివర్గం ఆమోదించడం ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ప్రతిపాదించిన డ్రోన్ సిటీలో సంబంధిత సంస్థలకు భూకేటాయింపులను కేటాయించడానికి గతంలో ఎస్ఐపీబీ చేసిన సిఫారసులను కూడా కేబినెట్ ఆమోదిస్తుందని చెబుతున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, ఆహ్వానితుల జాబితా, పెట్టుబడుల మొత్తం గురించి మంత్రివర్గం చర్చించనుంది.

రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు, మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలవడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపవచ్చు. అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+