Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రులతో సీఎం జగన్ కీలక భేటీ - ఎన్నికల నిర్ణయాలు..!!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ప్రధాన పార్టీలకు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా నిర్ణయాలకు ఆమోదం వేయటం ద్వారా కోడ్ సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతోంది. ఈ భేటీలో ఎన్నికల నిర్ణయాలను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

మంత్రులకు దిశా నిర్దేశం : ఈ నెల 6న ఏపీ మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సమాచారం అందింది. అన్ని శాఖలు పూర్తి సమాచారంతో రావాలని నిర్దేశించారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో..పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్సార్ చేయూత కు ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల అంశాల పైన చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. ముందుగానే నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కోడ్ వచ్చినా అమలుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మందస్తు నిర్ణయాలు తీసుకుంటోంది.

Ap Cabinet to take Crucial Decisions Ahead Assembly Elections, to be held on march 6th

కీలక నిర్ణయాలు : ఉద్యోగుకు పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. మార్చిలో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చింది. ఐఆర్ అవసరం లేదని నేరుగా పీఆర్సీ అమలు చేస్తామంటూ మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. అయితే, వచ్చే కొత్త ప్రభుత్వంలోనే పీఆర్సీ అమల్లోకి రానుంది. దీంతో..ప్రస్తుతం ఐఆర్ చెల్లింపు పైన ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ లోగానే ఉద్యోగ సంఘాలతో మరోసారి మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది. ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఐఆర్ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అదే విధంగా గత మేనిఫెస్టోలో దశల వారీగా మద్య నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీని పైన రాజకీయంగా విమర్శలు ఉన్నాయి.

Ap Cabinet to take Crucial Decisions Ahead Assembly Elections, to be held on march 6th

ఎన్నికల వరాలు : ఈ సారి మంత్రివర్గ సమావేశంలో దశల వారీ మధ్య నిషేధం పైన ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. మంత్రులకు ప్రచార బాధ్యతల తో పాటుగా 58 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ నిర్దేశించారు. ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూనే.. కొత్తగా ఏం చేయాలనే దాని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 10న జరిగే సిద్దం సభలో ఎన్నికల వరాలను సీఎం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, అంతకు ముందు జరిగే మంత్రివర్గ సమావేశంలోనే వీటికి సంబంధించి చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+