అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహా స్మార్ట్!: చంద్రబాబు కలల 'అమరావతి' మహాద్భుతం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి, రాజధాని ప్రాంతాల బృహత్‌ ప్రణాళికలను సీఆర్డీఏ విడుదల చేసింది. వీటిపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానిస్తూ శనివారం రాత్రి బహిరంగ ప్రకటన జారీ చేసింది.

జులై 20న సింగపూర్‌ ప్రభుత్వం అందించిన 3 మాస్టర్ ప్లాన్ పైన ప్రభుత్వం వివిధవర్గాలు, నిపుణుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. ప్రభుత్వమూ కొన్ని మార్పులు సూచించింది.

వాటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆ మాస్టర్ ప్రాణాళికకు సీఆర్డీఏ సవరణలు చేసింది. ఇప్పుడు ఆ ముసాయిదా ప్రణాళికలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌‌లో పెట్టి ప్రజల ముందుంచుతున్నట్లు ప్రకటించింది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, రాజధాని ప్రాంతాల బృహత్‌ ప్రణాళికలను సీఆర్డీఏ విడుదల చేసింది. వీటిపై ప్రజాభిప్రాయాలను ఆహ్వానిస్తూ శనివారం రాత్రి బహిరంగ ప్రకటన జారీ చేసింది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

జులై 20న సింగపూర్‌ ప్రభుత్వం అందించిన 3 మాస్టర్ ప్లాన్ పైన ప్రభుత్వం వివిధవర్గాలు, నిపుణుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. ప్రభుత్వమూ కొన్ని మార్పులు సూచించింది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

వాటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆ మాస్టర్ ప్రాణాళికకు సీఆర్డీఏ సవరణలు చేసింది. ఇప్పుడు ఆ ముసాయిదా ప్రణాళికలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌‌లో పెట్టి ప్రజల ముందుంచుతున్నట్లు ప్రకటించింది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

30 రోజుల్లోపు ఈ ప్రణాళికలపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయొచ్చని సీఆర్డీఏ కమిషనర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

నేరుగా బృహత్‌ ప్రణాళికలను పరిశీలించదలచిన వారు విజయవాడ, గుంటూరు, తెనాలి, తుళ్లూరుల్లోని సీఆర్డీఏ కార్యాలయాలను సందర్శించవచ్చని తెలిపారు.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్


లిఖితపూర్వకంగా అభ్యంతరాలు, సూచనలు చేయదలిచినవారు కమిషనర్‌, ఏపీసీఆర్డీఏ, లెనిన్‌ సెంటర్, గవర్నరుపేట, విజయవాడ520002 అన్న చిరునామాకు పోస్టులో పంపించొచ్చని, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసైనా పంపొచ్చని తెలిపారు.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

ఇలా పంపే ప్రతి ఒక్కరూ తమ పేరు, చిరునామా, ఫోన్‌/ఫ్యాక్స్‌ నంబర్‌, ఈమెయిల్‌ చిరునామా తప్పనిసరిగా పొందుపరచాలని స్పష్టంచేశారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

నెల రోజుల తర్వాత చేసే సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. ముప్పై రోజులలోపే అభిప్రాయాలను కచ్చితంగా పంపించాల్సి ఉంటుంది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

రాజధాని బృహత్‌ ప్రణాళికలను గడువులోగా అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచస్థాయి నగర నిర్మాణానికి 2014 డిసెంబరు 30న సీఆర్డీఏ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

సీఆర్డీఏ చట్టంలోని 38 నిబంధన ప్రకారం ఏడాదిలోగా రాజధాని ప్రాంత భావి ప్రణాళిక, రెండేళ్లలోగా రాజధాని నగర సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలి. ఈ చట్టానికి లోబడి గడువుకు నాలుగు రోజుల ముందే ప్రాంత భావి ప్రణాళిక సిద్ధమైంది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

మరో ఏడాది సమయం మిగిలి ఉండగానే రాజధాని నగర సమగ్ర ముసాయిదా ప్రణాళిక అందుబాటులోకి వచ్చింది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధి రాజధాని ప్రాంతీయ పరిధిలోని సహజ వనరులు, పర్యావరణం, చెరువులు, కాలువలు, నదీ ప్రవాహాన్ని కాపాడుతూ అభివృద్ధికి రాచబాటలు వేశారు.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

సీఆర్డీఏ చట్టం ప్రకారం.. 8603.32 చ.కిమీ విస్తీర్ణంలో ప్రాంతీయ పరిధి భావి ముసాయిదా ప్రణాళిక తయారు చేశారు. ఈ పరిధిని ఎనిమిది ప్రణాళిక జోన్లుగా విభజించారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

రాజధాని నగరం చుట్టూ ప్రతిజోన్‌లో ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు ఉండేలా ప్రత్యేక నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

అంతర్గత, ఔటర్ రింగురోడ్లు, ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌, అధిక వేగ రైలు, అంతర్గత జలమార్గాలు, సబర్బన్‌ రైళ్లు తదితర రవాణా వ్యవస్థలను ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

అంతర్గత రింగురోడ్డు వెడల్పు 75 మీటర్లుగా పేర్కొన్నారు. ఇక అవుటర్‌ రింగురోడ్డు వెడల్పు 150 మీటర్లుగా ఉంటుంది.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

రాజధాని ప్రాంతీయ పరిధిలోని రవాణా వ్యవస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తారు. ఈ అనుసంధానానికి మల్టీ మోడల్‌ సమీకృత రవాణా హబ్‌ను ఏర్పాటు చేస్తారు.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

ప్రధాన రహదారుల వెంట అభివృద్ధి కారిడార్‌లను ప్రణాళికలో పేర్కొన్నారు. గ్రిడ్‌ ఆధారిత రోడ్లు రాజధాని నగర పరిధి 217 చ.కి.మీ.గా ఉంది.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య అవసరాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించనున్నారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

నగరంలో గ్రిడ్‌ ఆధారిత రోడ్లు ప్రతిపాదించారు. ప్రధాన, ప్రధానేతర, అంతర్గత రహదారులను కలిపే ప్రధాన రోడ్లను సూచించారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి సూచించిన మేరకు రోడ్లను వంపుల్లేకుండా సవరించారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

రాజధాని నగరాన్ని ప్రభుత్వ, ఆర్థిక, పర్యాటకం, విజ్ఞాన, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్‌, మీడియా, న్యాయ, క్రీడల నగరాలు పేరిట తొమ్మిది నగరాలుగా విభజించారు. కొండవీటి వాగుకారణంగా వరదలు రాకుండా విపత్తు నిర్వహణ చర్యలు సూచించారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

వచ్చే జన్ లోగా హైదరాబాదులోని ఏపీ సచివాలయం మొత్తాన్ని బెజవాడకు తరలించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం సుమారు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవన నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

తాను విజయవాడలో, అధికారులు హైదరాబాదులో ఉంటే పరిపాలన సవ్యంగా సాగదని, మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని ఏపీకి తరలించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ విడుదలైంది. 2050 నాటి అవసరాలకు అనుగుణంగా బృహత్ ప్రణాళికను సిద్ధం చేశారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

మాస్టర్ ప్లాన్‌లో భూవినియోగ గణాంకాలు మారాయి. వాణిజ్య, పారిశ్రామిక భూమి తగ్గింది. హైస్పీడ్ రైళ్లు, జల మార్గాలతో ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థకు ప్రణాళికలో చోటు కల్పించారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

ఆర్థిక శక్తి కేంద్రంగా కొత్త రాజధానిని నిర్మించాలని భావిస్తున్నారు. దాదాపు ఏడువేల హెక్టార్లు నివాస ప్రాంతాలకు, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దాదాపు మూడువేల నాలుగువందల హెక్టార్లు, పౌరసేవల మౌలిక సదుపాయాలకు దాదాపు రెండువేల హెక్టార్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలకు దాదాపు ఆరున్నరవేల హెక్టార్లు ఉంటాయి.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్


అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సీఆర్డీఏ వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 7 పీడీఎఫ్ ఫార్మాట్‌లోని ఫైళ్లను సీఆర్డీఏలోని వెబ్ పేజీలో ఉంచింది.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

వీటిల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని పరిధిలోకి వచ్చే మండలాల వివరాలను, రాజధాని మాస్టర్ ప్లాన్ హైరెజల్యూషన్ ఫోటోలను ఉంచింది.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

వీటిపై ప్రజలకు అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా అంటే, జనవరి 24లోగా తెలియజేయాలని పేర్కొంది.
అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా లేదా తెలియజేయవచ్చని, సీఆర్డీఏ చిరునామాకు పోస్ట్ కూడా చేయవచ్చని చెప్పింది. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఫైళ్లను ఉంచింది.

అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

ఈ మాస్టర్ ప్లాన్ వివరాల ప్రకారం... కృష్ణా జిల్లాలోని అగిరిపల్లి, బావులపాడు, చల్లపల్లి, చందర్లపాడు, జీ కొండూరు, గన్నవరం, ఘంటసాల, గుడివాడ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మోపిదేవి, మొవ్వ, మైలవరం, నందిగామ, నందివాడ, నూజివీడు, పామర్రు, పమిడిముక్కల, పెదపారుపూడి, పెనమలూరు, తోటవల్లూరు, ఉంగుటూరు, వత్సవాయి, వీరుల్లపాడు, విజయవాడ అర్బన్, రూరల్, ఉయ్యూరు మండలాలను చేర్చారు.

 అమరావతి మాస్టర్ ప్లాన్

అమరావతి మాస్టర్ ప్లాన్

గుంటూరు జిల్లాలో... అమరావతి, అమృతలూరు, అచ్చంపేట, భట్టిప్రోలు, చేబ్రోలు, దుగ్గిరాల, యడ్లపాడు, గుంటూరు, కొల్లిపర, కొల్లూరు, క్రోసూరు, మంగళగిరి, పెద్దకూరపాడు, పెద్దకాకాని, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తాడేపల్లి, తెనాలి, చుండూరు, తుళ్ళూరు, వట్టి చెరకూరు, వేమూరు మండలాలను కలిపారు. కృష్ణా నది పక్కనే ఆకాశహర్మ్యాలు నిర్మిస్తారు.

English summary
AP capital Amaravati capital plan released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X