అమరావతికి రూట్‌మ్యాచ్ సిద్ధం: లగ్జరీ కార్లు, 19 హోటళ్లలో 1000 గదులు(ఫోటోలు)

గుంటూరు: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం దగ్గర పడుతున్న కొద్దీ ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి విజయవాడకు వచ్చే అతిథులను వేదిక వద్దకు తీసుకువెళ్లేందుకు నగర ప్రముఖులు తమ ఖరీదైన లగ్జరీ కార్లను ఇవ్వాలని ఎంపీ నాని చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభించింది.

నగరంలోని పలువురు ప్రముఖులు తమ ఆడి, బెంజ్, జాగ్వార్ వంటి కార్లను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కార్లలోనే ప్రముఖలను ఉద్దండరాయుని పాలెం వరకూ తీసుకెళ్లి, ఆ తర్వాత తిరిగి వారిని గన్నవరం విమానాశ్రయానికి చేర్చుతారు.

మరోవైపు రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేవని విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక సెల్ టవరును ఏర్పాటు చేయనుంది. ఆదివారం సాయంత్రంలోగా సెల్ టవర్ నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొంది. ఇప్పటికే రాజధాని శంకుస్ధాపన జరగనున్న ఉద్దండరాయునిపాలెంకు వచ్చే అన్ని మార్గాల్లోనూ పోలీసులు ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించారు.

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

రోడ్ల మలుపుల వద్ద ట్రాఫిక్ జాంలు కాకుండా చూసేందుకు సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామస్థులకు ఈరోజు మంత్రులు ఆహ్వాన పత్రికలు అందాయి. ఏపీ మంత్రులు సునీత, మృణాళిని, నారాయణలు స్వయంగా వెళ్లి పట్టు వస్త్రాలు పంపిణీ చేసి భూములిచ్చిన రైతులను పేరుపేరునా ఆహ్వానించారు.

 అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో రాజధాని శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని చూసేందుకు వస్తున్నారు. శంకుస్థాపన జరిగే ప్రాంతంలో యాగశాల, ప్రధాన వేదిక, ఇతర వేదికల వద్ద యువత సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడుతోంది.

 అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

ఇక శంకుస్థాపన ప్రాంతం ఇప్పుడు పర్యాటక శోభను సంతరించుకుంది. పండగ నాడు రద్దీ దృష్ట్యా అక్కడికి వెళ్లలేమని భావించే వారు, ఇప్పుడే వేదిక వద్దకు వచ్చి ఏర్పాట్లను చూసి వెళుతున్నారు. మరోవైపు శంకుస్థాపన వేదికకు గన్నవరం విమానశ్రయం లేదా విజయవాడ, గుంటూరు నగరాల నుంచి రోడ్డు మార్గాన వేదికకు చేరుకోవటానికి ప్రత్యేక రూట్‌మ్యాప్‌‌ను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.

 అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

వీవీఐపీలు, వీఐపీలు, సాధారణ ప్రజలు ఇలా పలు వర్గాలుగా విభజించి ఏపీ ప్రభుత్వం పాస్‌లను ముద్రించింది. హాజరయ్యే అతిథులకు, వారి వాహనాలకు ప్రత్యేకంగా పాస్‌లు అందజేస్తున్నారు. వీరంతా ఒకే మార్గంలో ప్రయాణిస్తే ట్రాఫిక్‌ స్తంభిస్తుందని భావించిన అధికారులు ఏ, ఏఏ, ఏఏఏ పాస్‌లు కలిగిన వారిని అత్యంత ప్రముఖులు, ముఖ్యులుగా గుర్తించి వారిని ప్రత్యేక మార్గంలో సభా వేదిక వద్దకు తీసుకెళ్లటానికి అధికారులు రూట్ మ్యాప్‌ను రూపొందించారు.

 అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

ఈ మార్గంలో ఈ పాస్‌లు కలిగిన వారు మినహా మిగిలిన వారిని అనుమతించరు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు సభా ప్రాంగణానికి చేరుకోవటానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వారు ప్రయాణించే మార్గాల్లో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. వీఐపీలను ఈ మార్గంలో తీసుకెళతారు.

 అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

21వ తేదీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో 15 మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మరో 3 ఓల్వో బస్సులు వీఐపీలను హోటళ్లకు తరలించడానికి అక్కడ అందుబాటులో ఉంచుతారు. 22న అతిథులను విమానాశ్రయం లేదా కేటాయించిన హోటల్‌ నుంచి శంకుస్థాపన ప్రాంతానికి బస్సులు, ఇన్నోవా కారుల్లో తీసుకెళతారు.

 అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

సాధారణ ప్రజలు శంకుస్థాపన ప్రాంతానికి మొత్తం ఆరు మార్గాల్లో చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మార్గాలు ఇలా.. ఏ, ఏఏ, ఏఏఏ పాస్‌లు కలిగిన ఎవరైనా సరే గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని బెంజిసర్కిల్‌, వారధి, తాడేపల్లి, పంపుహౌస్‌, ఎన్టీఆర్‌ కరకట్ట, స్క్రూబ్రిడ్జి, ఉండవల్లి జంక్షన్‌, ఉండవల్లి గ్రామం, ఉండవల్లి బ్రిడ్జి, బీష్మాచార్య రహదారి మీదుగా వేదిక ప్రాంగణానికి చేరుకోవచ్చు.

 అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

గుంటూరు వైపు నుంచి వస్తుంటే గుంటూరు, నాగార్జున విశ్వవిద్యాలయం, కాజ టోల్‌గేట్‌ దాటుకుని తాడేపల్లి వద్ద కేఎల్‌ వర్సిటీకి వెళ్లే సర్వీస్‌ రోడ్డులోకి వచ్చి ఎడమవైపు నుంచి పెట్రోలు బంకు, ఎన్టీఆర్‌ కరకట్ట, స్క్రూబ్రిడ్జి, ఉండవల్లి మీదగా బీష్మాచార్య రోడ్డు నుంచి వేదిక ప్రాంగణంలోకి చేరుకోవాలి.

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే వారు నందిగామ, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి బైపాస్‌మీదగా సితార జంక్షన్‌, చనుమోలు ఫ్త్లెఓవర్‌ నుంచి కుడి వైపునకు తీసుకుని ఎర్రకట్ట, బీఆర్‌టీఎస్‌ రహదారి మీదగా రామవరప్పాడు రింగ్‌ చేరుకుని అక్కడి నుంచి బెంజిసర్కిల్‌మీదగా వారధి, తాడేపల్లి వద్ద సర్వీస్‌రోడ్డులోకి వెళ్లి అక్కడి నుంచి ఉండవల్లిమీదగా భీష్మాచార్య రోడ్డులోకి ప్రవేశించి వేదిక ప్రాంగణానికి రావొచ్చు.

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

అమరావతి అంకురార్పణ: తాజా సమాచారం ఇదే

వీఐపీలు బస చేయటానికి వీలుగా విజయవాడ నగరంలో 19 హోటళ్లలో వెయ్యి గదులు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు వసతి, రవాణా సౌకర్యాలను ప్రోటోకాల్‌ విభాగం చూస్తుంది.

అమరావతి అంకురార్పణ: రూట్‌మ్యాప్, తాజా సమాచారం ఇదే (ఫోటోలు)

అమరావతి అంకురార్పణ: రూట్‌మ్యాప్, తాజా సమాచారం ఇదే (ఫోటోలు)

అమరావతి అంకురార్పణ: రూట్‌మ్యాప్, తాజా సమాచారం ఇదే (ఫోటోలు)

అమరావతి అంకురార్పణ: రూట్‌మ్యాప్, తాజా సమాచారం ఇదే (ఫోటోలు)

అమరావతి అంకురార్పణ: రూట్‌మ్యాప్, తాజా సమాచారం ఇదే (ఫోటోలు)

అమరావతి అంకురార్పణ: రూట్‌మ్యాప్, తాజా సమాచారం ఇదే (ఫోటోలు)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+