దుర్గగుడి: ఆరా తీసిన చంద్రబాబు, 'తాంత్రిక పూజలు జరగలేదు, శుద్ది చేశాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విజయవాడ దుర్గగుడిలో చోటు చేసుకొన్న ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు.ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు విజయవాడ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. ఈ ఘటనలో విచారణాధికారిగా వెంకటేశ్వర్‌రావను నియమించారు. అయితే ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయాన్ని శుద్ది చేశామని ఆలయ ప్రధాన పూజారి బద్రీనాథ్ ప్రకటించారు.

  దుర్గ గుడిలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో !

  దుర్గగుడి ఈవో సూర్యకుమారిపై వేటు...నూతన ఈఓగా రామచంద్రమోహన్‌...రహస్య పూజల వివాద ఫలితం..

  విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు చోటు చేసుకొన్నాయనే విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుదవారం నాడు ఆరా తీశారు. కడప జిల్లా పర్యటనకు వెళ్ళే ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో గౌతం సవాంగ్‌ సమావేశమయ్యారు. ఈ ఘటనపై గౌతం సవాంగ్ చంద్రబాబుకు పూర్తి సమాచారం ఇచ్చారు.

  అయితే ఈ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబునాయుడు గౌతంసవాంగ్‌ను ఆదేశించారు.అయితే ఈ ఘటనలో విచారణాధికారిగా వెంకటేశ్వర్‌రావును నియమించారు.

   దుర్గగుడి ఘటనపై చంద్రబాబు ఆరా

  దుర్గగుడి ఘటనపై చంద్రబాబు ఆరా

  దుర్గగుడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణల విషయమై బాబు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌ను ఆరా తీశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని బాబు సూచించారు. ఎవరిని కూడ వదలొద్దని బాబు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని బాబు సవాంగ్‌ను ఆదేశించారు. అయితే ఈ ఘటనపై విచారణకు వెంకటేశ్వర్‌రావును నియమించారు.

  మేం చెప్పినా సూర్యకుమారి పట్టించుకోలేదు

  మేం చెప్పినా సూర్యకుమారి పట్టించుకోలేదు

  ఆలయంలో తాంత్రిక పూజలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఆలయ చైర్మెన్ గౌరంబాబు స్పందించారు.వివాదం బయటకు తెలిసిన వెంటనే ఈవో సూర్యకుమారితో మాట్లాడినట్టు చెప్పారు. రాష్ట్రపతి భార్య వస్తోందని గుడిని శుద్ది చేసేందుకు ఆలయ తలుపులు తెరిచారని ఈవో వివరించారని చెప్పారు. తాము సూచించినప్పటికీ ఈవో ఎవరిపై కూడ చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

  అందరిని విచారిస్తాం

  అందరిని విచారిస్తాం

  దుర్గగుడి తలుపులు తెరిచిన రోజు విదుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించనున్నట్టు విచారణాధికారి వెంకటేశ్వర్ రావు చెప్పారు. ఇప్పటికిప్పుడే ఈ విషయాలపై మాట్లాడడం సరైందికాదన్నారు. అందరిని విచారించిన తర్వాత అన్ని నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు చెప్పారు.

  తాంత్రిక పూజలు జరగలేదు

  తాంత్రిక పూజలు జరగలేదు

  విజయవాడ దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ప్రధాన పూజారి బద్రీనాథ్ తెలిపారు. ఆలయంలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదన్నారు. ఆలయాన్ని శుద్ది చేశామని చెప్పారు.అమ్మవారిని బజారుకీడ్చకూడదని ఆయన కోరారు.

  అమ్మవారికి అలంకరణ చేశాం

  అమ్మవారికి అలంకరణ చేశాం

  దుర్గదుడిలో అలంకరణ చేశామని ప్రధాన పూజారి బద్రీనాథ్ బంధువు పార్థసారథి చెప్పారు. ఈ విషయమై పోలీసులు కూడ తనను విచారించారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు ఏం జరిగిందో పూర్తి విషయాలను పోలీసులకు వివరించానని ఆయన చెప్పారు.ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని చెప్పారు.

  దుర్గగుడి ఘటనపై స్వరూపానంద ఆగ్రహం

  దుర్గగుడి ఘటనపై స్వరూపానంద ఆగ్రహం

  దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే వార్తలపై శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడిలో అపచారాలు జరుగుతున్నాయని, అర్ధరాత్రి గుడిలోతాంత్రిక పూజలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన మండిపడ్డారు. దేవాలయాల పవిత్రను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల ఆదాయం మీద ఉన్న మక్కువ.. గర్భగుడిలో ఉన్న దేవుడిపై ప్రభుత్వానికికి ఎందుకు లేదని నిలదీశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra pradesh chief minister Chandrababu naidu enquired over Durga temple issue on Tuesday.Vijayawada CP Gowtham sawang met Ap Cm Chandrababu naidu on Tuesday at Amaravathi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి