Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముందస్తు ఎన్నికలు బాబుకు కలిసిరావా, చరిత్ర సృష్టిస్తారా?

అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశ్యం బాబుకు ఉన్నట్టు కన్పిస్తోంది.ఈ మేరకు టిడిపి ముందుగానే ఎన్నికలకు తన శ్రేణులను సిద్దం చేస్తోందనే సంకేతాలను ఇచ్చింది.అయితే ముందస్తు ఎన్నికలు గతంలో బాబుకు కలిసిరాలేదు. ఈ దఫా ముందస్తు ఎన్నికలకు వెళ్తే బాబుకు కలిసివస్తోందా, లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

కేంద్రంలో టిడిపి భాగస్వామ్యంగా ఉంది. 2014 ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి కూటమిగా పోటీచేశాయి. అయితే 2019 వరకు ఈ రెండు పార్టీల మధ్య మిత్రుత్వం కొనసాగుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు.

అయితే 2019 ఎన్నికల సమయంలో ఈ పార్టీల మధ్య పొత్తు విషయమై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే సమయంలో ఎన్నికలు జరగాల్సిన అవసరాన్ని మోడీ ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో నొక్కిచెప్పారు. ఈ విధానాన్ని దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకీభవించారు.

ముందస్తుకు బాబు సన్నద్దం

ముందస్తుకు బాబు సన్నద్దం

‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు' ప్రాతిపదికన దేశవ్యాప్తంగా 2019 ఏప్రిల్‌-మే నెలల్లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ముందుగానే రానున్నాయా ? 2018 డిసెంబరులోనే దేశవ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయా? ..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ముఖ్యమంత్రి చంద్రబాబు నోట వినిపించడం విశేషం. శనివారం నంద్యాల నియోజకవర్గంలో ప్రచార సభలో ఆయన ప్రసంగించారు .‘సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడేళ్లయింది. మిగిలింది రెండేళ్లే. ముందస్తు ఎన్నికలు జరపాలనుకుంటే 2018 డిసెంబరులోనే ఎన్నికలు రావచ్చు. అంటే నంద్యాల ఎన్నిక కేవలం ఏడాదిన్నర కోసమే' అని ముక్తాయించారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలు నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే ఎన్నికలు వస్తాయనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

మోడీ బాటలోనే బాబు

మోడీ బాటలోనే బాబు

కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పట్ల జనం మొగ్గుచూపుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బిజెపి ఘన విజయం సాధిస్తోంది. ఈ విజయాల పరంపరను కొనసాగించేందుకుగాను నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలను నిర్వహిస్తే తమకు కలిసివచ్చే అవకాశం ఉందని బిజెపి విశ్వసిస్తోంది. దీంతో ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలనే అభిప్రాయంతో బిజెపి నేతలున్నారు. అయితే అదే బాటలో వెళ్తే తనకు కూడ కలిసివచ్చే అవకాశం ఉందని బాబు కూడ ధీమాతో ఉన్నారు. మోడీతో కలిసి ఎన్నికలకు వెళ్తే మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొనే అవకాశం ఉందని టిడిపి అధినేత భావనగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

 ముందస్తు బాబుకు కలిసిరాదా?

ముందస్తు బాబుకు కలిసిరాదా?

2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికలకు ఆరు మాసాల షెడ్యూల్ కంటే ముందుగానే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్ళారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వల్ల ఆనాడు టిడిపి రాష్ట్రంలో ఘోరపరాజయం పాలైంది. అలిపిరిలో చంద్రబాబుపై మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ప్రమాదంలో చంద్రబాబునాయుడు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదం ఘటనతో సానుభూతిపవనాలు కలిసివస్తాయని భావించి ఆరుమాసాలకు ముందే ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబుకు ఆ ఎన్నికల్లో తీవ్రనష్టం వాటిల్లింది.

వాజ్‌పేయ్‌ను ఒప్పించి ముందస్తుగానే

వాజ్‌పేయ్‌ను ఒప్పించి ముందస్తుగానే

2004లో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్‌పేయ్ కూడ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఆ సమయంలో ఎన్‌డిఏలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించేవారు. అయితే అదే సమయంలో వాజ్‌పేయ్ కూడ ఆరుమాసాల ముందుగానే ఎన్నికలకు వెళ్ళడానికి చంద్రబాబు ఒప్పించారనే ప్రచారం అప్పట్లో ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన బిజెపి, టిడిపి తీవ్రంగా నష్టపోయాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసింది . ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.అయితే ముందస్తు ఎన్నికలు బాబుకు గతంలో కలిసిరాలేదు.కానీ, ఈ దఫా ముందస్తుకు వెళ్తే గత చరిత్ర పునరావృతం అవుతోందా, చరిత్రను తిరగరాస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+