వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలకమండలిని రద్దు చేస్తా: నివేదిక రాకుండానే ఎలా చెప్పారు: బాబు సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడ కనకదుర్గ పాలకమండలి సభ్యుల వ్యవహరశైలిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే పాలకవర్గాన్ని రద్దు చేస్తానని ఆయన కూడ బాబు స్పష్టం చేసినట్టు సమాచారం.

Recommended Video

దుర్గ గుడి ఘటన: ఎవరేమన్నారంటే..? మాణిక్యాల రావు రాజీనామా సస్పెన్స్ ?

దుర్గగుడి: ఆరా తీసిన చంద్రబాబు, 'తాంత్రిక పూజలు జరగలేదు, శుద్ది చేశాం'దుర్గగుడి: ఆరా తీసిన చంద్రబాబు, 'తాంత్రిక పూజలు జరగలేదు, శుద్ది చేశాం'

దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ప్రచారం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి. అయితే పాలకమండలి సభ్యులు కూడ దుర్గగుడిలో తాంత్రిక పూజుల జరిగాయని పదే పదే ప్రకటించడంపై చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

పాలకమండలిని రద్దు చేస్తానని బాబు హెచ్చరించారని సమాచారం. దుర్గగుడి విషయంలో చోటు చేసుకొన్న పరిణామాలపై చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాలకమండలి సభ్యులతో గురువారం నాడు సమావేశం నిర్వహించారు. బాబు ఆదేశాలను పాలకమండలి సభ్యులకు వివరించారు.

 దుర్గగుడి పాలక మండలిని రద్దు చేస్తా

దుర్గగుడి పాలక మండలిని రద్దు చేస్తా

విజయవాడ దుర్గగుడి పాలక మండలిని రద్దు చేస్తానని చంద్రబాబునాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి సభ్యులే కొందరు మీడియాకు చెప్పడంపై బాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారని సమాచారం. నివేదిక రాకుండానే తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి సభ్యులు చెప్పారని బాబు ప్రశ్నించారని సమాచారం.అవసరమైతే పాలకమండలిని రద్దు చేస్తానని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

 ఈవోనే పూజలు చేయించారని ఎలా చెప్పారు

ఈవోనే పూజలు చేయించారని ఎలా చెప్పారు

దుర్గగుడిలోనే ఈవోనే పూజలు చేయించారని ఎలా చెబుతారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పిలిపించి ఈ విషయమై చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఎందుకు పాలక మండలి సభ్యులు ఈ రకంగా వ్యవహరించారని బాబు వెంకన్నను ప్రశ్నించారని సమాచారం.పాలకమండలి సభ్యులు వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోందని బాబు అభిప్రాయపడ్డారు.

 విపక్షాలకు ఆయుధమిచ్చారు

విపక్షాలకు ఆయుధమిచ్చారు

దుర్గగుడి సభ్యులు వ్యవహరించిన తీరు విపక్షాలకు ఆయుధమిచ్చినట్టుగా ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారని సమాచారం. పాలక మండలి సభ్యులు భాద్యతారాహిత్యంగా మాట్లాడారని బాబు అభిప్రాయపడినట్టు సమాచారం.తాంత్రిక పూజలు జరిగాయని పాలక మండలి సభ్యులు చేసిన ప్రకటన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్టైంది.

 పాలకమండలి సభ్యులతో ఎమ్మెల్సీ వెంకన్న సమావేశం

పాలకమండలి సభ్యులతో ఎమ్మెల్సీ వెంకన్న సమావేశం

పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమావేశమయ్యారు. చంద్రబాబుతో జరిగిన సమావేశం వివరాలను పాలకమండలి సభ్యులకు వివరించారు. మరో వైపు పాలకమండలి సభ్యుల తీరుపై బాబు ఆగ్రహంగా ఉన్న విషయాన్ని కూడ వెంకన్న ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు సమాచారం.

English summary
Ap chief minister Chandrababu Naidu unhappy on Kanakadurga temple committee members recent issues.MLC Buddha Venkanna met Chandrababunidu on Thursday at Amaravati. Chandrababu said that disolve the committee
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X