టీడీపీకి సీఐడీ నోటీసులు- పార్టీ పత్రిక చైతన్యరథంలో కథనాలపై..
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ సొంత పత్రికల వరకూ వచ్చేసింది. గతంలో వైఎస్ జగన్ కు చెందిన సాక్షిపత్రికపై టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేయిస్తే ఇప్పుడు టీడీపీ సొంత పత్రిక చైతన్యరథంలో కథనాలపై వైసీపీ సర్కార్ చర్యలకు దిగింది. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
ఇవాళ మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఐడీ అధికారులు.. టీడీపీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అనుబంధ పత్రిక చైతన్యరథంలో వస్తున్న వార్తా కథనాలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ టీడీపీ ఆఫీసుకు వచ్చిన సీఐడీ అధికారులు చైతన్యరథం పత్రికపై పార్టీ నేతలతో ఆరా తీసినట్లు తెలుస్తోంది.

చైతన్యరథం పత్రికను ఎవరు నడుపుతున్నారు, దానికి ఎడిటర్ ఎవరు వంటి వివరాలను టీడీపీ నేతలను సీఐడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో తయారు చేసిన నోటీసుల్ని లాయర్ కు ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో విచారణకు రావాలని సంబంధిత ప్రధాన కార్యదర్శిని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ అధికారికంగా స్పందించలేదు.
టీడీపీకి సీఐడీ నోటీసులు- పార్టీ పత్రిక చైతన్యరథంలో కథనాలపై..!!#TDP #ApCID #CID #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/5I72kmUOXG
— oneindiatelugu (@oneindiatelugu) April 11, 2023
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి అండగా ఉండే మీడియా ఛానళ్లు, పత్రికల సంఖ్య బాగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ పరిణామాల్ని ముందుగానే అంచనా వేసి చైతన్యరథం పేరుతో ఈ -పేపర్ ను పార్టీ ప్రారంభించింది. ఇందులో పూర్తిగా పార్టీ కోణంలోనే కథనాలు రాస్తుంటారు. ఇవి కాస్తా వైసీపీ నేతలకు, ప్రభుత్వానికి మంట పుట్టించినట్లు తెలుస్తోంది. అందుకే సీఐడీని రంగంలోకి దించారు.












Click it and Unblock the Notifications