దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు- జగన్ మాటల వక్రీకరణ- మార్ఫింగ్ వీడియో
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన మరో మాజీ మంత్రిపై వేధింపులు మొదలయ్యాయి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమపై ఏపీ సీఐడీ తాజాగా ఓ కేసు నమోదు చేసింది. సీఎం జగన్‌పై రూపొందించిన మార్ఫింగ్ వీడియోను విడుదల చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్లో సీఎం జగన్ మాట్లాడిన వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియో మార్పింగ్ చేసిందంటూ ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ దేవినేని ఉమపై కేసు నమోదు చేసింది. దేవినేని ఉమ సీఎం జగన్‌కు చెందిన మార్ఫింగ్ వీడియోను విడుదల చేయడంపై కర్నూలు తమ విచారణకు హాజరు కావాలని ఆయనకు ఇవాళ ఉదయం 10.20కి నోటీసులు ఇచ్చింది. అయితే విచిత్రంగా పదిన్నరకే కర్నూలు రావాలని అందులో సూచించింది.

సీఎం జగన్ మాటల్ని వక్రీకరించారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణకు విజయవాడలో సీఐడీ కార్యాలయం, గుంటూరులో ప్రాంతీయ కార్యాలయం ఉన్నా కర్నూల్‌లోని ప్రాంతీయ కార్యాలయానికే రావాలని సీఐడీ నోటీసులు జారీ చేయడం విశేషం. దేవినేని ఉమపై సీఐడీ 404, 465, 468, 469, 470, 471, 505, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ప్రెస్‌మీట్లో ప్రదర్సించిన జగన్ వీడియోను కూడా విచారణకు తీసుకురావాలని ఆయన్ను కోరింది.












Click it and Unblock the Notifications