వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతకాయల విజయ్ కు నోటీసులు అందుకే-సీఐడీ ప్రకటన- వైఎస్ భారతిపై ఫేక్ ప్రచారం..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వార్ లో ఇవాళ మరో వివాదం బయటపడింది. టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ హైదరాబాద్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయనకు 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని కోరారు. అయితే ఇంత సడన్ గా విజయ్ ను సీఐడీ ఎందుకు టార్గెట్ చేశారన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనికి సీఐడీ వివరణ ఇచ్చింది.

సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుని ఓ పోస్ట్ తయారుచేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేశారనేది చింతకాయల విజయ్ పై ఆరోపణ. వైఎస్ భారతి పేరుతో భారతీపే అంటూ ఓ ఫేక్ క్యూఆర్ కోడ్ కు క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారనే ఆరోపణపై విచారణలో భాగంగా చింతకాయల విజయ్ కు నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో చింతకాయల విజయ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చింది.

 ap cid says 41a notices to tdp leader chintakayala vijay for fake campaign on ys bharati

వాస్తవానికి చింతకాయల విజయ్ కు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు ఆయన ఇంట్లో వారిని వేధించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు సీఐడీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో సీఐడీ చింతకాయల విజయ్ చేశారని భావిస్తున్న ప్రచారంపై వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనిపై చింతకాయల విజయ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులపై సీఐడీ చర్యలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఐడీ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 ap cid says 41a notices to tdp leader chintakayala vijay for fake campaign on ys bharati
English summary
ap cid on today issued a statement on serving notices to tdp leader chintakayala vijay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X