ఆపరేషన్ సిందూర్ పై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
పాకిస్తాన్ పై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింథూర్ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రమూక అంతం కావాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. భారత్ మాతా కీ జై అంటూ నినదిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్.. స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఇక ఆపరేషన్ సింథూర్ మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది.భారత్ పాకిస్తాన్ ఉగ్ర స్తావరాలపైనే కాదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన కూడా సమర శంఖం పూరించి ముందుకు సాగుతుంది. తాజాగా ఆపరేషన్ సిందూర్ పౌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.

గర్వంగా వందనం చేస్తున్నాను అన్న చంద్రబాబు
ఎక్స్ వేదికగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు పహల్గామ్ ఉగ్రవాద దాడిపై వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల సాహస యోధులకు నేను గర్వంగా వందనం చేస్తున్నాను అన్నారు. వారి అసమాన ధైర్యం మరియు ఖచ్చితత్వంతో, మన దేశం ఉక్కు సంకల్పంతో తనను తాను రక్షించుకుంటుందని వారు మళ్ళీ నిరూపించారు.
#OperationSindoor
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2025
With pride, I salute the brave warriors of the Indian Armed Forces for swiftly avenging the Pahalgam terror attack. With their unmatched bravery and precision, they have again demonstrated that our nation will defend itself with iron will. Today, under the… pic.twitter.com/MlLfmaDTp7
మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందన్న ఏపీ సీఎం
గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రపంచం మన బలాన్ని మరియు దృఢ సంకల్పాన్ని చూసింది. మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంది. మన సాయుధ దళాలకు దృఢంగా మద్దతు ఇస్తుంది. జై హింద్ అంటూ చంద్రబాబు తన ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. మోదీ నిర్ణయానికి దేశం మద్దతుగా ఉందని స్పష్టం చేశారు.
దశాబ్దాల ఓర్పు అంటూ పవన్ ఆసక్తికర పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు. "శౌర్యం లేని చోట, ధర్మం పోతుంది, ధైర్యం లేని చోట స్వార్థం రాజ్యమేలుతుంది" అన్న దినకర్ వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ దశాబ్దాల ఓర్పు..ఓర్పు.. అంటూ ఇంతకాలం సహించామని పేర్కొన్నారు.
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है।
— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2025
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।।
- Dinakar
दशकों तक सहनशीलता... सहनशीलता!
अत्यधिक सहन के बाद मौन बैठी संपूर्ण भारतवर्ष को "ऑपरेशन सिंदूर" के… pic.twitter.com/fDMsq638Pr
మీ వెన్నంటే మేము అంటూ పవన్ మద్దతు
పరిమిత ఓపికతో చేతులు కోసుకున్న భారతదేశం మొత్తం "ఆపరేషన్ సింధూర్"తో భారతీయ సమాజంలోకి తిరిగి వచ్చింది. ధైర్యసాహసాలు కలిగిన ముగ్గురు కమాండర్లకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము. జైహింద్ అంటూ తన మద్దతును తెలియజేశారు.












Click it and Unblock the Notifications