మెగా PTM 3.0 : మన్యం జిల్లాలో సీఎం, మంత్రి లోకేష్.. చిన్నారితో భలే ఘటన !!
నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మోడల్ స్కూల్‌లో.. జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ మీటింగ్ కి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.
కాగా పాఠశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు ముందుగా నేరుగా విద్యార్థుల తరగతులను పరిశీలించారు. తర్వాత విద్యార్థులతోపాటు క్లాస్ రూములో కాసేపు కూర్చొని డిజిటల్ పాఠాలు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారనేది తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కూర్చుని వారితో ముచ్చటించారు. అలానే వారి ప్రోగ్రెస్ కార్డులను కూడా పరిశీలించారు.

చిన్నారితో ఆసక్తికర ఘటన..
ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు తన చేతిలో ట్యాబ్ పట్టుకొని ఓ చిన్నారి వద్దకు తీసుకెళ్లారు. అందులో ఉన్న అంశాన్ని చదవాలని సూచించగా.. చిన్నారి చదివే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి అభినందించారు.
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు.
— Telugu Desam Party (@JaiTDP) December 5, 2025
భామినిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన సీఎం, విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ పరిశీలించారు. #MegaPTM3inAP… pic.twitter.com/mY5c9DcAQR












Click it and Unblock the Notifications