నితీష్‌కు బాబు ఫోన్, అద్వానీ ఆశీస్సులు: బెజవాడ కాంగ్రెస్ సంబరాలు
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు బీహార్ ముఖ్యమంత్రి, జెడీయు ముఖ్యనేత నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. నితీష్‌కు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
బీహార్ ఫలితాల పైన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం స్పందించారు. దేశంలో పెరిగిపోతున్న మత అసహనం ప్రభావం బీహార్ ఎన్నికల పైన పడిందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మత అసహనం పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బెజవాడలో సంబరాలు
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంగా నిలిచింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అయితే, తాజాగా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ జట్టు కట్టిన మహా కూటమి (కాంగ్రెస్-జెడీయు-ఆర్జేడీ) ఘన విజయం సాధిస్తోంది.

మూడింట రెండు వంతుల సీట్లను కూటమి కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బెజవాడ యూత్ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. విజయవాదలోని పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. సొంత రాష్ట్రంలో కాకున్నా, దేశంలోని కీలక రాష్ట్రమైన బీహార్‌లో తమ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధించడం యుత్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
ట్విట్టర్లో పలువురికి నితీష్ థ్యాంక్స్
నితీష్‌కు ప్రధాని మోడీ, బిజెపి నేతలు మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి మరళీ మనోహర్ జోషీ తదితరులు నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. వారికి నితీష్ ధన్యవాదాలు చెప్పారు. అద్వానీకి ఫోన్ చేశానని, అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపానని, ఆయన ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకున్నానని నితీష్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications