జగన్‌కి ఇదీ మద్దతు, పులివెందుల టార్గెట్: లెక్కలు చెప్పిన బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్ను గత కొద్దికాలంగా ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఇలాకా పులివెందుల పైన పడింది. వచ్చే ఎన్నికల నాటికి పులివెందుల టిడిపి వశం కావాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఇప్పుడున్న 175 స్థానాలకు మరో యాభై తోడవుతాయని, మొత్తం 225 స్థానాలు అవుతాయని చెప్పారు. అన్ని స్థానాలలోను వచ్చే ఎన్నికల నాటికి గెలిచేలా కార్యక్రమాలు రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు.

babujagan

వైయస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో అరవై శాతం మద్దతు వైసిపికి ఉందని, టిడిపికి ముప్పై శాతం ఉందని చెప్పారు. ఇలాంటి నియోజవకర్గంలో కూడా విజయం సాధించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.

పార్టీ సమావేశం అనంతరం గురువారం నాడు పార్టీ ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష వైసిపి గురించి చర్చించారా అని ప్రశ్నించారు. దానికి కళా మాట్లాడుతూ.. జగన్‌ను ప్రజలే తిరస్కరించారని, ఇక పార్టీ గురించి చర్చించాల్సిన అవసరం ఏముందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu keen on YSRCP chief YS Jagan's Pulivendula.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి