అమరావతిపై చంద్రబాబు కీలక నిర్ణయం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయని అందరూ భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇటీవల సీఎం చంద్రబాబు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలోనే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో భారీ విధ్వంసం చేసిందని చంద్రబాబు ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
రాజాధానిలో ఏపీ ప్రభుత్వ చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురికావడంతో అక్కడ భారీ నష్టం సంభవించింది. దీంతో నష్ట నివారణ కోసం ప్రస్తుత ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది. అయితే ఈ చర్యలకు భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏపీకి రాజధానిగా చెప్పిన అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సిసి రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు.

రాజధానిని శుభ్రం చేసేందుకు టెండర్లు
ఇక రాజధాని అమరావతిని శుభ్రం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించడం కోసం భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది. దీనికోసం 36.50 కోట్ల రూపాయలతో టెండర్లను ఆహ్వానిస్తుంది. రాజధాని అమరావతిలోని 29 గ్రామాలలో 25000 ఎకరాలలో జంగిల్ క్లియరింగ్ కోసం ఏపీ సిఆర్డిఏ ఈ మేరకు టెండర్లను ప్రకటించింది.
నేటి నుండి బిడ్ డాక్యుమెంట్స్ పోర్టల్ లో
వారం రోజుల్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెల రోజుల్లో రాజధాని అమరావతిని శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే సిఆర్డిఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ కోసం 36.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి బిడ్ డాక్యుమెంట్ ను ఈ ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించి ప్రాసెస్ మొదలు పెడుతున్నారు .
టెండర్లు ఎప్పటి నుండి అంటే
టెండర్ల ప్రక్రియలో భాగంగా కాంట్రాక్టర్లతో ఈనెల 15వ తేదీన ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహిస్తారు. 22వ తేదీన క్లారిఫికేషన్ కోసం కాంట్రాక్టర్లతో సమావేశం అవుతారు. అదే రోజు నుంచి బిడ్ లను సమర్పించే అవకాశం కల్పిస్తారు. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టెండర్ల సమర్పణకు గడువు ముగుస్తుంది. కాంట్రాక్టు సంస్థలు కన్సార్టియంగా కానీ జాయింట్ వెంచర్ గా కానీ ఏర్పడి టెండర్లలో పాల్గొనేలా అవకాశం కల్పించారు.
నెలరోజుల్లో రాజధాని జంగిల్ క్లియరెన్స్ లక్ష్యంగా
ఇక అర్హతల ప్రాతిపదికన, తక్కువ కోడ్ చేసిన సంస్థలకు పనులు అప్పగిస్తారు. నెలరోజుల వ్యవధిలో రాజధాని ప్రాంతమంతా పెరిగిపోయిన పిచ్చి చెట్లను, ముళ్ళకంపలను తొలగించి రాజధానిని పరిశుభ్రం చేయనున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాజధానిలో పిచ్చి చెట్లు తొలగింపుకు 36.50 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని టిడిపి కూటమి ప్రభుత్వం వెల్లడిస్తోంది.












Click it and Unblock the Notifications