ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ లకు కీలక ఆదేశాలు ఇచ్చారు.నెల్లూరు, తిరుపతి తీర జలాల్లోకి తమిళనాడు మత్స్యకారులు అక్రమంగా ప్రవేశిస్తూ, మత్స్య సంపదను కొల్లగొడుతుండటం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రజల ఆందోళనల దృష్ట్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల జాలర్ల చొరబాటును ఏపీ సముద్ర జలాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

జాలర్ల అక్రమ ప్రవేశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలకవ్యాఖ్యలు

జాలర్ల అక్రమ ప్రవేశం విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు తమిళనాడు జలాల్లోకి వెళ్లరని, అలాగే తమిళనాడు జాలర్లు కూడా ఏపీలోకి వచ్చి ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి వస్తే, వారిని ఉపేక్షించకుండా కఠినంగా నియంత్రిస్తామని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ, 'ఎవ్వరి మాట వినొద్దు, ఇది నా ఆదేశం' అన్నారు.

ap cm chandrababu key directions to those collectors On Illegal Incursions by Tamil Nadu fishermen

తమిళనాడు జాలర్ల అక్రమ చొరబాట్లపై స్థానిక మత్స్యకారుల తీవ్ర ఆందోళన

మరోవైపు, నెల్లూరు తీర ప్రాంతంలోకి తమిళనాడు జాలర్ల అక్రమ చొరబాట్లపై స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చొరబాటుదారులు తమ మత్స్య సంపదను కొల్లగొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించి, అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. రాష్ట్ర తీరంలోకి ఇతర రాష్ట్రాల జాలర్లను, పడవలను ఏమాత్రం అనుమతించవద్దని ఆదేశించింది.

హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను రంగంలోకి దింపిన సీఎం చంద్రబాబు

తీరప్రాంత భద్రతను పటిష్టం చేసేందుకు, అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను రంగంలోకి దింపాలని చంద్రబాబు ఆదేశించారు. తమిళనాడు జాలర్ల అక్రమ చొరబాట్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు.తమిళనాడు పడవలు తరచుగా సరిహద్దులు దాటుతుండటంతో ఏపీలోని స్థానిక జలాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితి నివారించడానికి తమిళనాడు, కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

అక్రమ చొరబాట్లపై తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి లేఖ

అక్రమ చొరబాటు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని 162 తీర ప్రాంత గ్రామాల ప్రజలు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని ఈ మేరకు చంద్రబాబు వివరించారు. తమిళనాడు పడవల నిబంధనల ఉల్లంఘన వల్ల స్థానిక మత్స్యకారుల చేపల వేటకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.ఇలాంటి అక్రమ చొరబాట్లను నియంత్రించాలని, తమ జాలర్లకు సరిహద్దు నిబంధనలపై అవగాహన కల్పించాలని చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వాన్ని తన లేఖలో కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+