స్పీడ్ రైలులో బ్యూసన్ సిటీకి... దక్షిణకొరియాలో చంద్రబాబు రెండోరోజు పర్యటన
సియోల్: దక్షిణ కొరియాలో ఏసీ సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు కొరియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం చంద్రబాబు దక్షిణ కొరియాలోని పారిశ్రామిక నగరం బ్యూసన్ సందర్శన కోసం స్పీడ్ రైలులో వెళ్లారు. సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం సోమవారం దక్షిణ కొరియాకు చేరుకున్నారు.

తొలిరోజే సుమారు రూ.8 వేల కోట్ల విలువైన పెట్టుబడులను సాధించడంలో విజయవంతమయ్యారు. 37 కొరియా సంస్థలు ఏపీలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత తెలిపాయి.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవల్‌పమెంట్ బోర్డు (ఏపీఈడీబీ)తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు ఇన్వెస్ట్‌స్టమెంట్(ఎల్‌వోఐ)పై సంతకాలు చేశాయి. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 7171 ఉద్యోగాలు రానున్నాయి. వీటితోపాటు కియా అనుబంధ సంస్థలన్నీ కలిపి రాష్ట్రంలో రూ.4995.20 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి.












Click it and Unblock the Notifications