చంద్రబాబు పాల్గొన్న నీతి ఆయోగ్ భేటీలో మమతకు అవమానం
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి నీతి ఆయోగ్ సమావేశంలో అవమానం ఎదురైంది. ఆమె మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఈ ఉదయం నీతి ఆయోగ్ సమావేశం ఆరంభమైన విషయం తెలసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబుతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు.

ముఖ్యమంత్రులు భజన్‌లాల్ శర్మ- రాజస్థాన్, హిమంత బిశ్వ శర్మ- అస్సాం, భూపేంద్ర పటేల్- గుజరాత్, మోహన్ యాదవ్- మధ్యప్రదేశ్, విష్ణు దేవ్ సాయ్- ఛత్తీస్‌గఢ్, ఏక్‌నాథ్ షిండే- మహారాష్ట్ర.. ఇందులో పాల్గొన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా భాగస్వామ్యపక్షాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వార్షిక బడ్జెట్‌లో వివక్ష చూపించారనే కారణంతో దీన్ని బాయ్‌కాట్ చేస్తోన్నట్లు ఇదివరకే ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీ హాజరు కాలేదు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేసినట్లు వెల్లడించారాయన. సిద్దరామయ్య- కర్ణాటక, ఎంకే స్టాలిన్- తమిళనాడు, పినరయి విజయన్- కేరళ.. ఈ సమావేశానికి దూరం అయ్యారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నుంచి కూడా ఎవరూ ఈ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రమే ఈ కూటమి నుంచి హాజరయ్యారు. ఆమెకు అవమానం ఎదురైంది. ఆమె మాట్లాడే సమయంలో పలుమార్లు మైక్ కట్ చేశారు. దీనితో ఆమె ఈ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బయటికి వచ్చిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనపై వివక్ష చూపారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించకుండా ఓ ముఖ్యమంత్రి అనే బాధ్యతతో తాను ఈ సమావేశానికి హాజరయ్యానని, ప్రతిపక్షం నుంచి తాను మాత్రమే ఈ భేటీకి వచ్చానని అన్నారు. అయినప్పటికీ తనను మాట్లాడకుండా ఆపారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి వివక్ష చూపకూడదని కేంద్రాన్ని కోరానని, తాను మాట్లాడటం పూర్తి కాకుండానే మైక్ కట్ చేశారని అన్నారు. ఇది పశ్చిమ బెంగాల్‌ను మాత్రమే కాకుండా అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా అవమానించడమేనని వ్యాఖ్యానించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications