అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చస్తామని బెదిరిస్తారా: ఫాతిమా విద్యార్థులపై బాబు ఆగ్రహం, చేతులెత్తేసిన కామినేని

ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులపై ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆదివారం సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. దీంతో తనను కలవాలని వారికి సూచించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులపై ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆదివారం సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. దీంతో తనను కలవాలని వారికి సూచించారు.

జగన్‌ను వేడుకున్నా కనికరించలేదు, గెంటేశారు: గిడ్డి ఈశ్వరి షాకింగ్జగన్‌ను వేడుకున్నా కనికరించలేదు, గెంటేశారు: గిడ్డి ఈశ్వరి షాకింగ్

ఈ నేపథ్యంలో ఫాతిమా విద్యార్థులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. మీ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే అల్లరి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, ఎంసిఐతో చేస్తున్న సంప్రదింపులు కనిపించడం లేదా అని నిలదీశారు.

 మీరు సెల్ టవర్ ఎక్కి బెదిరిస్తారా

మీరు సెల్ టవర్ ఎక్కి బెదిరిస్తారా

మేం మా ప్రయత్నాలు చేస్తుంటే మీరు టవర్ ఎక్కి చనిపోతామని బెదిరిస్తారా అని ఆగ్రహించారు. మీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో విద్యార్థులు మనస్తాపం చెందారని తెలుస్తోంది.

 మా చేతుల్లో లేదని కామినేని

మా చేతుల్లో లేదని కామినేని

విద్యార్థులు అంతకుముందు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి కామినేని శ్రీనివాస రావును కలిశారు. దీనిపై కామినేని చేతులెత్తేశారు. ఈ వ్యవహారం తమ చేతుల్లో లేదని, ఫాతిమా కాలేజీ మోసంపై సిఐడి విచారణ జరుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వారు సీఎంను కలిశారు.

 ఏపీ తీర్మానం

ఏపీ తీర్మానం

ఇదిలా ఉండగా, ఫాతిమా సమస్యలపై మండలి, అసెంబ్లీలో ఏపీ తీర్మానం చేసింది. వంద మంది విద్యార్థుల సమస్యగా గుర్తించింది. కేంద్రం జోక్యం చేసుకొని సుప్రీంను ఆశ్రయించాలని తీర్మానం చేసింది.

 కేంద్రమంత్రిని కలిసిన వైసీపీ ఎంపీ

కేంద్రమంత్రిని కలిసిన వైసీపీ ఎంపీ

ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రమంత్రి అనుప్రియా పటేల్‌ను కలిశారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించవద్దన్నారు. ఇతర కాలేజీల్లో విద్యార్థులను రీలొకేట్ చేయాలన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Monday fired at Fatima College Students for their agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X