మనవడితో 7 రోజులు: దేవాన్ష్‌తో కలసి విమానమెక్కిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారు. నిత్యం పరిపాలన, రాజధాని నిర్మాణ పర్యవేక్షణ, మంత్రులు ఉద్యోగులతో సమీక్షలతో బిజీగా గడిపే సీఎం చంద్రబాబు నాయుడు వాటి నుంచి సేదదీరేందుకు వారం రోజుల విదేశీ పర్యటనకు కుటుంబ సభ్యులతో కలిసి పయనమయ్యారు.
చంద్రబాబు వ్యక్తిగత పర్యటనగా పేర్కొంటున్న ఈ విదేశీ పర్యనటలో ఆయనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌లు ఆయన వెంట వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత చంద్రబాబు కుటుంబం థాయ్‌లాండ్ వెళ్లనున్నారు.

ఆ తర్వాత అక్కడ నుంచి స్విట్జర్లాండ్‌లో ఆయన కుటుంబం గడపనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా తన మనవడు దేవాన్ష్‌తో ఆయన గడిపేందుకే ఈ పర్యటనను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి బయల్దేరి వెళ్లిన చంద్రబాబు తిరిగి వారం రోజుల తర్వాత అంటే ఈ నెల పదిహేవ తేదీన విజయవాడకు చేరుకుంటారు.
తాను విదేశీ పర్యనటకు వెళ్తున్న క్రమంలో మంత్రులంతా విజయవాడలోనే ఉండి పరిపాలనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications