• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హోదాపై దిద్దుబాటు చర్యలు, ఏదో ఒకటి తేల్చేద్దాం: జైట్లీతో అమిత్ షా భేటీ

By Nageshwara Rao
|

న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై బీజేపీ పెద్దలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ లేదా హోదా అనే దానిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో గత రెండు రోజులుగా కీలక సమావేశాలు జరిగినట్లు సమాచారం.

ఈ సమావేశాల్లో భాగంగా బీజేపీ జాతీయ ఆధ్యక్షుడు అమిత్ షాతో పాటు అరుణ్‌ జైట్లీ, టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగడియా, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇద్దరు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేని పక్షంలో ప్రత్యేక సాయం పేరుతో ఎక్కువ నిధులు ఇవ్వాలని అమిత్ షా జైట్లీకి సూచించారు.

దీనిపై వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేయాలని, ఆలస్యం జరిగితే పార్టీకి మరింత నష్టం కలుగుతుందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఆలస్యం చేసిన కొద్దీ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మరోవైపు హోదా అంశం ప్రజల్లో సెంటిమెంట్‌గా మారిందని, సాయం కన్నా హోదాపైనే మొగ్గు చూపితే బాగుంటుందని జైట్లీ, అమిత్ షాలకు వెంకయ్య చెప్పారు. ఎలాగూ ప్రత్యేకసాయం పేరుతో నిధులు ఇవ్వాలనుకుంటున్నప్పుడు హోదా ఇస్తే నష్టమేమిటని జైట్లీని అమిత్ షా ప్రశ్నించినట్లు తెలిసింది.

దీనికి జైట్లీ ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ర్టాలు కేంద్రంపై దండయాత్ర చేస్తాయని, తేనెతుట్టెను కదిలించినట్లవుతుందని అన్నారు. ముందు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, దీనిపై ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే స్పందనను బట్టి హోదాపై ప్రకటన చేద్దామని అన్నారు.

వాస్తవానికి ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే అంశంపై రాజ్యసభలో ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు చర్చకు అంగీకరించినట్లుగా చెప్పారని తెలుస్తోంది. కేంద్రంలో నిధులు లేమి నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకహోదా ప్యాకేజీని కూడా ప్రకటించే పరిస్థితిలో లేమని అమిత్ షాకు వివరించారు.

 ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

కేంద్రం ఏది ఇవ్వాలని అనుకున్నప్పటికీ, వెంటనే ఇచ్చేద్దామని అమిత్ షా జైట్లీకి సూచించారని సమాచారం. అంతేకాదు గత రెండేళ్లుగా ఏపీకి ఎన్నో పథకాలను, నిధుల రూపంలో వేల కోట్ల రూపాయలను ఇచ్చినా ప్రజలింకా హోదా గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారని అమిత్ షా ఆరా తీసినట్లుగా తెలిసింది.

 ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయనతో చర్చించి ప్యాకేజీపై తుది నిర్ణయం తీసుకోవాలని అరుణ్‌ జైట్లీకి అమిత్ షా సూచించారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా 14వ ఆర్థిక సంఘం ఎటువంటి సిఫారసులు చేయలేదంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా వీరి సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

 ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఆర్థిక సంఘం చైర్మన్‌ వైవీ రెడ్డి, సభ్యుడు అభిజిత్ సేన్‌లు కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌కు పంపిన లేఖలను సుజనా చౌదరి అందరికీ చూపించారు. ప్రజలు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. హోదా ఇవ్వలేని పక్షంలో ఎంత సాయం చేస్తారో దానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను విడదల చేయాలని, అప్పుడే ప్రజలు శాంతిస్తారని జైట్లీతో సుజనా చౌదరి చెప్పినట్లుగా తెలుస్తోంది.

 ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఇక నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగడియా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల నష్టమేమీ లేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను లెక్కపెడితే వివిధ శాఖలకు గాను ఏపీకి రూ.2.25లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, అదే హోదా ప్రకటిస్తే ఇవన్నీ మరుగున పడతాయని సూచించారు.

ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఏదో ఒకటి తేల్చేద్దాం, నిధులకు బదులు హోదా: జైట్లీతో అమిత్ షా

ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పాటు అనేక పద్దుల కింద ఏపీకి నిధులను ప్రత్యేకంగాఇవ్వాల్సి ఉందని చెబుతూ ప్రత్యేక ప్యాకేజీపై నీతి ఆయోగ్‌ గతంలో పీఎంఓకు అందజేసిన నివేదిక ప్రతిని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేశారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on wednesday met President Pranab Mukherjee in New Delhi amid demands for special category status to his state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X