గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏసు ప్రభువు జీవితం ప్రపంచ చరిత్రకే ఆదర్శమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే పేదరికం లేని సమాజం చూడాలన్నదే జీవితాశయంగా పెట్టుకుని అంకితభావంతో పనిచేస్తున్నానని తెలిపారు.

ప్రజలందరికీ క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లాలోని అడవితక్కెళ్లపాడులో బుధవారం క్రిస్మస్‌వేడుకలను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.10 కోట్లతో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించే ఏపీ క్రైస్తవభవన్‌కు సీఎం శంకుస్థాపన చేశారు.

ఆ తర్వాత క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఏసు ప్రభువు పుట్టిన పవిత్రమైన మాసం. ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్‌. ఏసుప్రభువు దయవల్ల మీ జీవితాల్లో వెలుగులు రావాలని ప్రార్థిస్తున్నాను'' అని చంద్రబాబు ఆకాంక్షించారు.

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే


అంతకుముందు క్రైస్తవమతపెద్దలతో కలసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్‌ కేకు కట్ చేసిన చంద్రబాబు మతపెద్దలకు తినిపించారు. క్రిస్టియన్లలో ఐదు రంగాల్లో సేవలు అందించిన 9 మందిని చంద్రబాబు సత్కరించి ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే


చంద్రన్న క్రిస్మస్ కానుకగా 20 కిలోల బియ్యం, కిలో గోధుమపిండి, అరకిలో చొప్పున శనగపప్పు, కందిపప్పు, బెల్లం, అరలీటరు పామాయిల్‌, వందగ్రాముల నెయ్యిని ఒక ప్యాక్‌గా నిరుపేదలైన క్రైస్తవులు పండుగ చేసుకునేందుకు చంద్రన్న క్రిస్మస్‌ కానుకను పండుగ రోజునే అందించనున్నట్లు తెలిపారు.

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే


ప్రజల్లో చైతన్యం రావాలని, క్రిస్మస్‌ సందర్భంగా శాశ్వత పేదరిక నిర్మూలన కోసం ప్రజలు శ్రీకారం చుట్టాలన్నారు. వీరిని చైతన్యం చేయడానికి మతపెద్దలు ముందుకురావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదవారికి భరోసా ఇవ్వడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు.

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే

10 కోట్లతో క్రైస్తవ భవన్: క్రిస్మస్‌కు చంద్రన్న కానుకలివే


ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, క్రైస్తవమతపెద్దలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి మతపెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుని సన్మానించారు. వచ్చే క్రిస్మస్‌ పండగనాటికి క్రైస్తవభవన నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు.

English summary
Ministers, legislators and leaders showed interest in receiving cake pieces from Andhra Pradesh Chief Minister, Mr N. Chandrababu Naidu during Pre-Christmas celebrations. The state government conducted pre-Christmas celebrations officially on Wednesday at Adavitakk-ellapadu near Guntur by laying foundation stone for the AP government sanctioned Christian Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X