ఢిల్లీ చేరుకున్న బాబు, హైదరాబాద్ కేసీఆర్ కుటుంబ జాగీరు కాదన్న ఎంపీ
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. వినామాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేశారు. మంగళవారం మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు మీడియాలో విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉమ్మడి రాజధానిలో సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశారని, రాజధానిపై సర్వాధికారాలన్నీ గవర్నర్‌కు కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ కేసీఆర్ కుటుంబ జాగీరు కాదన్న ఎంపీ
హైదరాబాద్ కేసీఆర్ కుటుంబ జాగీరు కాదని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేసే ముందు కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవాలని, కేంద్రం అనుమతి లేకుండా సీఎం చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఈ ఫోన్ ట్యాపింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని, హైదరాబాద్‌పై తెలంగాణకు ఎంత హక్కుందో, ఏపీకి అంతే హక్కుందని అన్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications