బాబు జ్ఞాపకశక్తి: 12 ఏళ్ల తర్వాత వికలాంగుడిని పేరు పెట్టి మరీ...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జ్ఞాపకశక్తి ఎక్కువే అనేందుకు ఓ ఘటన గురువారం విజయవాడలో జరిగింది. ఎప్పుడో పన్నండేళ్ల క్రితం తనను కలిసిన ఓ వికలాంగుడిని చంద్రబాబు పేరు పెట్టి మరీ పిలిచి మరీ పలకరించాడు.
12 ఏళ్ల క్రితం జరిగిన ఓ కరెంటు ప్రమాదం వల్ల డాక్టర్లు అతని చేతుల్ని మోచేయి వరకూ తీసేశారు. అప్పట్లో సీఎం హోదాలో విజయవాడ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుని చెందిన వికలాంగుడు దుర్గారావు ఆయనను కలిశాడు.

రాజధాని పర్యటలో భాగంగా... గురువారం లబ్బీపేట వేంకటేశ్వరస్వామిగుడికి వెళ్తున్నప్పుడు దారిలో కాన్వాయ్ ఆపి, తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన దుర్గారావును... పేరు పెట్టి పిలిచి మరీ చంద్రబాబు మాట్లాడారు. కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు.
చదువు పూర్తయ్యాక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం కలిసిన తనను ముఖ్యమంత్రి చంద్రబాబు తనను గుర్తుపెట్టుకుని మరీ ఆప్యాయంగా మాట్లాడడంతో దుర్గారావు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.












Click it and Unblock the Notifications