తమ్ముడి పాడె మోసి రుణం తీర్చుకున్న చంద్రబాబు-లోకేష్, రోహిత్ సైతం..!
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నిన్న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడుకు ఇవాళ ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు చేరుకున్న రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి ఇవాళ పలువురు మంత్రులు, వీఐపీలు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని నారావారిపల్లెలోని వారి పూర్వీకులకు అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి అంతిమ యాత్రగా తరలించారు. ఈ యాత్రలో చంద్రబాబుతో పాటు లోకేష్, రోహిత్ తో పాటు పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అంతిమయాత్రలో తమ్ముడు రామ్మూర్తి నాయుడు పాడే మోసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన రుణం తీర్చుకున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, నారా రోహిత్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా రామ్మూర్తి నాయుడు పాడె మోశారు. రామ్మూర్తి నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో అన్న చంద్రబాబుకు చేదోడు వాదోడుగా నిలిచారు. దీంతో పాటు ఆయనకు ఓసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించారు కూడా. ఇప్పుడు చంద్రబాబు పాడెమోసి ఆయనకు రుణం తీర్చుకున్నారు.
తమ్ముడి పాడె మోసి రుణం తీర్చుకున్న చంద్రబాబు-లోకేష్, రోహిత్ సైతం..!#NaraRamamurthyNaidu #RamamurthyNaidu #ChandrababuNaidu #NaraLokesh #NaraRohit pic.twitter.com/2tBm83ozCu
— oneindiatelugu (@oneindiatelugu) November 17, 2024












Click it and Unblock the Notifications