ఎవరు తప్పుచేసినా శిక్షిస్తాడు: బాబు(ఫోటోలు)
తిరుపతి: ‘తిరుమల పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎవరు తప్పు చేసినా వెంకన్న వారిని వదలకుండా శిక్షిస్తాడు' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. పనిలో పనిగా జాగ్రత్తగా విధులు నిర్వహించాలంటూ మీడియా వారికీ హితవు చెప్పారు. తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ధార్మిక సమాజ నిర్మాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ఎస్వీబిసి ఛానల్ ద్వారా వెంకటేశ్వర మహత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని టిటిడి అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న బాబు అర్థరాత్రి రెండు గంటల వరకు అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపారు.
శుక్రవారం శ్రీవారిని దర్శించుకుని ఆలయంలోని రంగనాయక మండపంలో ఇఓ, జెఇఓలతో పాటు ఆలయ ప్రధానార్చకులతో సుమారు 20 నిమిషాలు చర్చలు జరిపారు. అనంతరం ఆలయం వెలుప విలేఖరులతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి వారి మహత్యాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా మరిన్ని భక్త జన రంజకమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
తిరుమలకు గురువారం రాత్రి చేరుకున్న ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు మూడు గంటల పాటు తితిదే కార్యక్రమాలపై సమీక్షించారు. శుక్రవారం ఉదయం మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారాయణలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
రంగనాయకుల మండపంలో పండితుల వేదాశ్వీరచనం అందుకుని తితిదే సత్కారం అందుకున్నారు. అనంతరం మండపంలోనే తితిదే ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ ఓఎస్డీ డాలరు శేషాద్రి, ప్రధాన అర్చకులతో సమావేశమయ్యారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుగుణమ్మ ఇంటికి వెళ్లి అక్కడ అల్పాహారం స్వీకరించారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
టిటిడి భక్తులపై విధిస్తున్న రాయల్టీ పన్నులను కూడా రద్దు చేయమని అధికారులను ఆదేశించానన్నారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
కాగా తిరుచానూరులో విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఎ పికి న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
తిరుపతిని మెగా సిటీగా ఏర్పాటు చేయడంలో భాగంగా వౌలిక సదుపాయాల కల్పనపైనే కాకుండా, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని కబ్జా దారులపై కేసులు నమోదు చేస్తామని చంద్రబాబు అన్నారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
తితిదే ప్రక్షాళన నిరంతర ప్రక్రియగా సాగుతోందని, భక్తుల నిరీక్షణ సమయం తగ్గించామని, స్వామి సన్నిధిలో మూడు వరుసల దర్శనంతో యాత్రికులకు సౌకర్యం కల్పించామని వివరించారు. కాలానుగుణంగా మరిన్ని మార్పులు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల ద్వారా పేదలకు మరింతగా మెరుగైన వైద్య సేవలందించడానికి ప్రణాళిక రూపొందించి తనను కలవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిని మెగా సిటీగా రూపు దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఎవరు తప్పుచేసినా వెంకన్న శిక్షిస్తాడు: బాబు
తిరుమలకు వ్యాపారులు తీసుకువచ్చే వస్తువులపై తితిదే రెవెన్యూ శాఖ విధించే రాయల్టీని రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాయల్టీ ప్రభావం పరోక్షంగా భక్తులపై పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి స్పందించారు.












Click it and Unblock the Notifications