సింగపూర్ పారిపోను, జగన్‌ని చూసి భయపడ్డారు: 'కాపు'పై బాబు, 'కృష్ణయ్యా! అర్థం చేసుకో'
విజయవాడ: బీసీలు మొదటి నుంచి టిడిపి వెంటే ఉన్నారని, కాపులు తన పైన నమ్మకంతో ఓటు వేశారని వారికి అన్యాయం చేసే ప్రసక్తి లేదని, తాను జగన్ చెప్పినట్లు సింగపూర్ వెళ్లనని ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టిడిపి నేతలను కాపు గర్జన సమావేశానికి వెళ్లవద్దని చెప్పానని స్పష్టం చేశారు. నేను చెప్పే వరకు విపక్షాలకు కాపులు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. జగన్‌ను చూసి భయపడే గోదావరి జిల్లాల వారు ఓటు వేయలేదన్నారు.
అన్ని మేనిఫెస్టోలు అదే చెప్పాయి
ఎన్నికల సమయంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాయని తెలిపారు. అన్ని పార్టీలు అదే చెప్పాయని, కాపులు వెనుకబడినట్లు అన్ని పార్టీలు గుర్తించాయని, అయితే బీసీలకు నష్టం లేకుండా కాపులను చేరుస్తామని అందరూ చెప్పారన్నారు.

ఇప్పుడు తాము అదే చేస్తున్నామన్నారు. 2014 ఎన్నికల్లో అన్ని పార్టీలు మేనిఫెస్టోలో బిసి అంశాన్ని పెట్టాయన్నారు. తాను నిన్న కాపు నాయకులకు అన్ని విషయాలను వివరించానని చెప్పారు. జీవో 30 పైన 1994 నుంచి 2014 వరకు ఎవరూ ఎందుకు మాట్లాడలేదన్నారు.
బీసీలకు నష్టం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామని వైసిపి ఎన్నికల సమయంలో చెప్పందన్నారు. తాము అదే చెప్పామన్నారు. దాని ప్రకారమే కమిషన్ వేశామన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను చేర్చవలసిన బాధ్యత పైన తమ పైన ఉందన్నారు.
బీసీలు, కాపులు మా వెంటే
మొదటి నుంచి బీసీలు తమ వెంటే ఉన్నారన్నారు. బీసీలు అంటే టిడిపి, టిడిపి అంటే బీసీలు అన్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం చేయమన్నారు. అదే సమయంలో కాపులు తన పైన నమ్మకంతో ఓటు వేశారని చెప్పారు. కాబట్టి వారికి ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు.
కాపు అంశం చాలా సున్నితమైనదని, దానిని ఎవరైనా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటే బూమరాంగ్ అవుతుందన్నారు. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టాలని ఓ వ్యక్తి చూస్తున్నారని వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ముసుగులు ధరించి వచ్చి విధ్వంసం చేయడం ఏమిటన్నారు.
ఇలా చేస్తే రాష్ట్రానికి నష్టం కాదా అన్నారు. నేను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, ఇప్పుడు కొందరు దుర్మార్గులు చేసిన ఘటన వల్ల మనకు నష్టం జరిగే పరిస్థితి కాదా అని ప్రశ్నించారు. ఓ పక్క ట్రెయిన్ కాలుస్తుంటే ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారన్నారు.
టిడిపి నేతలను వెళ్లవద్దని చెప్పా
పోలీస్ స్టేషన్లను కాల్చడం ఏమిటన్నారు. కాపు గర్జనకు తెలుగుదేశం పార్టీ నేతలను వెళ్లవద్దని చెప్పానని అన్నారు. కాపు అంశంపై అందరితో పాటు మేం చెప్పామని, అదే మేం ఇప్పుడు చేస్తున్నామన్నారు. వైసిపికి, కాంగ్రెస్ పార్టికి పదేళ్లుగా కాపులు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు.
నేను సింగపూర్ పారిపోతానా.. నీవు జైలుకు
నేను సింగపూర్ వెళ్లిపోతానని, ఇళ్లు ఉన్నాయని నిన్న వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని, నేను ఎక్కడికీ పారిపోవనని, నీవు జైలుకు వెళ్తావన్నారు. ఇలాంటి నేరస్తులు తమను విమర్శించడం ఏమిటన్నారు. జగన్‌ను చూసి భయపడి గోదావరి జిల్లాల ప్రజలు ఓటేయలేదన్నారు.
ఆయనకు ఓటు వేస్తే మరో పులివెందుల అవుతుందని భయపడి ఓటు వేయలేదన్నారు. మతం పేరుతో, కులం పేరుతో వారు దుర్మార్గం చేస్తారన్నారు. జగన్ వంటి అవినీతి, దుర్మార్గుల వలలో ఎవరూ పడవద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
కాపులకు న్యాయం చేస్తా.. కృష్ణయ్య అర్థం చేసుకోవాలి
కాపులలో పేదరికం ఉందని, వారికి న్యాయం చేస్తానని చెప్పారు. కొందరు బీసీ నాయకులు ఇప్పుడు హెచ్చరిక ప్రకటనలు చేస్తున్నారని, కానీ అది సరికాదన్నారు. తాము మేనిఫెస్టోలో పెట్టామని గుర్తు చేశారు. కాపులను బీసీలలో చేర్చే అంశాన్ని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బిసి నేత ఆర్ కృష్ణయ్య అర్థం చేసుకోవాలన్నారు.
ఎవరీని గౌరవించరు.. కొడతారు
జగన్ వంటి వారు ఎవరినీ గౌరవించరని, ఆయన పార్టీ ఎంపీ ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టడం ఏమిటని మండిపడ్డారు. గంగిరెడ్డితో సంబంధం అన్నారు. పరిటాల రవి ఎలా చనిపోయాడో అందరికీ తెలుసనని చెప్పారు.
మార్చి 31వ తేదీ నాటికి పట్టిసీమ పూర్తవుతుందని చెప్పారు. కుడి ప్రధాన కాలువను పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. కుడి, ఎడమ కాలువల మధ్య ఉన్న చెరువులను నింపుతామని చెప్పారు. పదిహేను వందల ఎయిర్ గన్‌లు తయారు చేశామని, రబీలో పరీక్షిస్తామన్నారు.
జలవనరుల శాఖ మంత్రివర్గ సమావేశంలో చర్చించామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఏడు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. పంట సంజీవినిలో భాగంగా పది లక్షల పంట కుంటలు నిర్మిస్తామన్నారు. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా చేస్తామన్నారు. ఏటా గ్రామాల్లో 5వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేస్తామని చెప్పారు.
నాలుగైదేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పూర్తవుతాయని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో రైతులు దిగుబడి సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు నివాసయోగ్యంగా లేవన్నారు.
అన్ని వసతులు కల్పిస్తూ గృహ నిర్మాణ విధానం తీసుకు వస్తామని చెప్పారు. ఈ పాస్, ట్యాబ్‌ల వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. సంక్షేమ పథకాలు, శాంతిభద్రతల కోసం ఎలక్ట్రానిక్ డివైస్‌లను వినియోగిస్తామని చంద్రబాబు చెప్పారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications