సీమకు వెళ్లిపోతారు: బెజవాడకి బాబు హెచ్చరిక, ఏకైక సీఎంగా రికార్డ్!

విజయవాడ: విజయవాడలో అద్దెల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అద్దెలు, భూముల విలువలు భారీగా పెరిగితే పెట్టుబడులు రావని రాజధాని ప్రాంత, విజయవాడ ప్రాంత ప్రజలను చంద్రబాబు హెచ్చరించారు.

ఇలాగైతే అందరూ రాయలసీమ వైపు చూస్తారని చెప్పారు. అక్కడ కూడా ఇలాగే భూముల ధరలు, అద్దెల ధరలు పెంచితే ఇక పెట్టుబడులు పెట్టే వారు ఇతర రాష్ట్రాల వైపు చూస్తారని సీఎం చంద్రబాబు ఈరోజు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: జగన్‌తో జాగ్రత్త! కేంద్రానిదే బాధ్యత: బాబు, మేమున్నాం: వెంకయ్య

ఆ సౌకర్యం పొందే భారత తొలి సీఎంగా చంద్రబాబు!

ముఖ్యమంత్రి, ప్రధాని, గవర్నర్, రాష్ట్రపతి తదితరులు ఎక్కడికైనా బయలుదేరితే ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు అందరికీ తెలిసిన విషయమే. మిగతా పరిపాలనపై ఏ విధమైన అభిప్రాయాలున్నా, రాజకీయ నేతల ప్రయాణాలు సామాన్యులకు విసుగును, కోపాన్ని తెప్పిస్తుంటాయి.

AP CM Chandrababu’s call to control rents

అమరావతి ప్రాంతంలో ఈ సమస్య ఉండకూడదని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మించతలపెట్టిన సచివాలయం రూఫ్ టాప్ పైన హెలిప్యాడ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

సచివాలయం పైన హెలిపాడ్ ఏర్పాటైతే, భారత దేశంలో తన కార్యాలయంపై హెలిపాడ్ ఉన్న ఏకైక సీఎంగా చంద్రబాబు కొత్త చరిత్ర సృష్టించనున్నారు. సీఎం ఇంటి నుంచి బయలుదేరితే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం, ఆపై హెలికాప్టర్ దిగగానే వెంటనే కార్యాలయంలోకి వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఆర్డీయే కమిషనర్ ఎన్ శ్రీకాంత్ వెల్లడించారు.

సచివాలయంలో భాగంగా ఆరు భవనాలు వస్తాయని, చంద్రబాబు కార్యాలయం ఉండే ఏ బ్లాక్ పై 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అనువైగా హెలీపాడ్ నిర్మిస్తామని ఆయన వివరించారు. ఇలా జరిగితే అది అద్భుతమేనని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+