Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. తిరుపతి జిల్లా పుదూరు లోని టిడ్కో ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నిరుపేదలకు శుభవార్త చెప్పారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి టిడ్కో ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు.

మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

ప్రస్తుతం 2.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు జరుగుతున్నాయని, ఇప్పటికే 5.50 లక్షలు ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.డిసెంబర్ లోపు మరో 4. 50 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ లోపు 4.50లక్షల ఇళ్లను నిరుపేదలకు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ళ డిపాజిట్లకు సంబంధించి 82,000 మందికి ఇవ్వవలసిన 174 కోట్ల రూపాయల బకాయిలను ఈ నెలలోనే అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

AP CM Chandrababu said another good news Distribution of another 4 50 lakh houses by December

గృహ నిర్మాణ నిధుల మళ్లింపు చేసిన వైసీపీ సర్కార్.. కేంద్రం 28 కోట్ల జరిమానా

గృహనిర్మాణ నిధుల మళ్లింపు కారణంగా కేంద్ర ప్రభుత్వం 28 కోట్ల జరిమానా విధించిందని, నివాసయోగ్యం కాని చోట స్థలాల కేటాయింపు చేశారని గత ప్రభుత్వం చేసిన పనులను ఏకరువు పెట్టారు. రాష్ట్రానికి గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో తెలియజెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి పిఎన్జి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీని ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

మహిళలు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలన్న చంద్రబాబు

దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు కూడా డబ్బులు అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే సమయంలో మహిళలు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మహిళలకు ఏపీ రాజకీయాలలో సముచిత స్థానం ఉందన్నారు చంద్రబాబు. తమ ప్రభుత్వ హయాంలో సుపరిపాలన లక్ష్యంగా whatsapp గవర్నెన్స్ ప్రవేశపెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు.

దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం!
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం!

స్త్రీశక్తి ద్వారా మహిళలకే కాదు, ప్రజలకు సంక్షేమ పథకాలు

ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒకటవ తేదీన పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని, రాష్ట్ర ప్రజలకు అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చి ప్రజల అవసరాలను తీరుస్తున్నామని చంద్రబాబు అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+