జగన్ టూర్లను రెండు ముక్కల్లో చెప్పేసిన చంద్రబాబు..!

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సీఎంగా ఉన్న జగన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. కరోనా సమయం మినహాయిస్తే ఆ తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లి భారీ సభలు నిర్వహించారు. అయితే జగన్ సభల పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ఇవాళ సీఎం చంద్రబాబు రెండు ముక్కల్లో చెప్పేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వానపల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పై పలు సెటైర్లు వేశారు.

గత వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు జగన్ పరదాల పాలన చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికి వేశారని మండిపడ్డారు. జగన్ రావాలంటే పరదాలు కట్టాలని, ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు చేయాల్సిందే అన్నారు. అలా జగన్ పర్యటనల సందర్భంగా ఉండే పరిస్ధితులను చంద్రబాబు ప్రజలకు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కూటమి పాలనలో అలాంటి పరిస్ధితులు లేవన్నారు.

ap cm Chandrababu satires on ys jagan mark rule in vanapalli gram sabha

అలాగే వానపల్లి సభలో తన చేతికి ఉన్న రింగు గురించి కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మంత్రాలు వేసిన దేవుడి రింగు అని అనుకుంటారని, కానీ కాదన్నారు. ఈ రింగు తాను రాత్రి ఎంతసేపు పడుకున్నాను, శరీరం ఎంతవరకూ రెడీ అయ్యిందో చెబుతుందన్నారు. ఇప్పుడు ఓ సెన్సార్ వచ్చిందని, మీరు తినే తిండి వల్ల శరీరంలోకి ఎంత గ్లూకోజు వెళ్తుందో చెబుతుందని చంద్రబాబు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+