సొంత పార్టీ జూనియర్ మంత్రిపై చంద్రబాబు సీరియస్? ఆడియో కాల్ వైరల్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలు కావస్తోంది. ఈ ఐదు నెలల్లో ప్రభుత్వ పనితీరు, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు ఇలా ప్రతీ అంశంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, రిపోర్టులు కూడా తెప్పించుకుంటున్నారు. దీంతో పాటు తాజాగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరుతున్నారు. ఇందులో విఫలమైన ఓ జూనియర్ మంత్రికి చంద్రబాబు ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్ ను మంత్రి పదవి కూడా వరించింది. అయితే ఆయన తాజాగా నిర్వహిస్తున్న టీడీపీ సభ్యత్వ డ్రైవ్ లో విఫలమైనట్లు తెలుస్తోంది. తనకు ఇచ్చిన లక్ష్యంలో కేవలం 20 శాతమే పూర్తి చేయగలిగారని సమాచారం. దీంతో సీఎం చంద్రబాబు నేరుగా ఆయనకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్లు తాజాగా ఓ ఆడియో కాల్ వైరల్ అవుతోంది.

ఈ ఆడియో కాల్ లో చంద్రబాబు మంత్రి సుభాష్ ను "నువ్వు మెదటి సారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రివి అయ్యావు.. నువ్వు అన్ని మాట్లాడవద్దు, నువ్వు యంగ్ స్టర్ వి, నీకు ఇంకా రాజకీయాల పట్ల సరైన అవగాహన లేదు, నీ నియోజకవర్గం ఎక్కడ అనేది నువ్వు చూసుకున్నావా" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిపిన సంభాషణ వాయిస్ బయటకి ఎలా వచ్చిందన్న చర్చ మొదలైంది. సొంత పార్టీలోనే ఎవరైనా ఈ కాన్ కాల్ రికార్డ్ చేసి బయట పెట్టారా...పార్టీలో సుభాష్ వ్యతిరేక వర్గం చేసిన పనా అనే దానిపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications