వదిలేది లేదు: అత్యాచారాలపై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్: యువతులు, మహిళల పైన అత్యాచారానికి పాల్పడితే వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో హెచ్చరించారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లాలో యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై అసెంబ్లీలో చంద్రబాబు స్పందించారు.
మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ కేసును నిర్భయ చట్టం కింద నమోదు చేయనున్నట్లు చెప్పారు. కేసు విచారణలో దోషులుగా నిర్ధారైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా మరొకరు ఈ అఘాయిత్యాలకు పాల్పడాలంటే భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
తీర్మానం పంపించండి: రామచంద్రయ్య

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శాసనమండలిలో తీర్మానించి కేంద్రానికి పంపించాలని ఏపీ మండలి విపక్ష నేత రామచంద్రయ్య కోరారు. భూసమీకరణ, రుణమాఫీ, కరవు, నీటి ఎద్దడిపై చర్చకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు.












Click it and Unblock the Notifications