చంద్రబాబు ఆకస్మిక తనిఖీలకు డేట్ ఫిక్స్..! పథకాలపై ఆ ఫీడ్ బ్యాక్ తో..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. జూన్ 12తో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జూన్ 12న పలు కీలక పథకాల ప్రారంభంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరోలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అదే జూన్ 12 తర్వాత మరో కీలక కార్యక్రమం చేపడతానని చంద్రబాబు ప్రకటించారు.

జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సచివాలయంలో సమీక్ష చేసిన సీఎం.. ఈ నిర్ణయం వెల్లడించారు.
ప్రతివారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజలనుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను సమీక్షిస్తున్న సీఎం... రేషన్, దీపం, ఎపిఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను ఇవాళ పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

ap cm Chandrababu s sudden visits after June 12 to know implementation of welfare schemes

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి సంతృప్తి కనిపించాలని సిఎం తెలిపారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్దిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందే లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. లబ్దిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చన్నారు. అయితే వారికి మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుందన్నారు. దీపం పథకం లబ్దిదారుల నుంచి ఏజెన్సీ వాళ్లు కానీ, ఇతర స్థాయిల్లో గాని ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు.

మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా... అని ప్రశ్నించగా 74 శాతం మంది అవునని, వాటి నాణ్యతపై ఎలా ఉంది అంటే బాగుందని 76 శాతం మంది చెప్పారని చంద్రబాబు తెలిపారు. రేషన్ పంపిణీలో, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, అదే విధంగా గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా... అనే అంశంలో 62 శాతం మంది లేదు అని చెప్పారని చంద్రబాబు తెలిపారు. పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని, నేరుగా వారి ఖాతాల్లో ముందుగానే డబ్బులు వేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.

ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని, ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సిఎం ఆదేశించారు. బస్టాండ్‌లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందన్నారు. తాగునీటిపై 44 శాతం, టాయిలెట్లపై 55 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఇంటి నంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారని, గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడిచెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి, కంపోస్ట్ తయారీ చేపడతామని సిఎం అన్నారు.

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 325 సేవలు అందుతున్నాయని, మన మిత్ర ద్వారా వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 45 లక్షల మంది ఈ సేవలను విజయవంతంగా వినియోగించుకున్నారని తెలిపారు. జూన్ 12వ తేదీ నాటికి 500 సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోందని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ప్రతిపాదిత డ్రోన్ సిటీ, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్‌లో 300 ఎకరాల్లో ఏర్పాటు కానుందన్నారు. ఇందులో మొదటి దశ 116 ఎకరాల్లో నెలకొల్పుతున్నారు. దీనిలో 38 సంస్థలు భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి చూపించాయని, ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ సిద్దం కాగా, టెండర్ల ప్రక్రియ జూన్ 12 నాటికి పూర్తి అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+