వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అసెంబ్లీ ఎఫెక్ట్‌: చంద్రబాబుకే కాదు: కేసీఆర్‌కు జ‌గ‌న్ షాక్‌: స‌మాధానం చెప్పుకోవాల్సిందేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీలో చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు . గ‌తంలోనూ ఇదే విధానం అనుస‌రిస్తున్నా..ఇప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో స‌భా వేదిక‌గా మ‌రోసారి ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. గ‌త ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి..స్పీక‌ర్ ఫిరాయింపుల‌ను పోత్స‌హించారంటూచెబుతూనే త‌న ప్ర‌భుత్వంలో ఫిరాయింపుల విష‌యంలో ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించేదీ స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో ఏదైనా అలాంటి ప‌రిస్థితులు ఎదురైతే..స్పీక‌ర్‌గా మీరే అన‌ర్హ‌త వేటు వేయాల‌ని జ‌గ‌న్ చెప్ప‌ట‌మే ఇప్పుడు అస‌లు చ‌ర్చ‌...

చంద్ర‌బాబు ల‌క్ష్యంగా చెల‌రేగిన వైసీపీ..

చంద్ర‌బాబు ల‌క్ష్యంగా చెల‌రేగిన వైసీపీ..

ఎప్ప‌టి నుండో ఎదురు చూస్తున్న అవ‌కాశం వైసీపీ ద‌క్కించుకుంది. అంతే..స‌భ‌లోనే ఉన్న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తో స‌హా నాటి స్పీక‌ర్‌ను ల‌క్ష్యంగా చేసుక‌ని వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా టీడీపీ పైన విరుచుకుప‌డ్డారు. నాడు ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి ఏ ర‌కంగా ఫిరాయింపుల‌కు పాల్ప‌డిందీ గుర్తు చేసారు. అందుకే తాము అసెంబ్లీ స‌మావేశాల‌ను సైతం బ‌హిష్క‌రించాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌భ ద్వారా ఒక విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. టీడీపీకి ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా కొంత మందిని లాగేద్దామ‌ని కొంత మంది చెప్పినా తాను విన‌లేద‌ని..ఎవ‌రైనా త‌మ వైపు రావాలంటే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల్సిందేన‌న్నారు. ఒక వేళ ఈ స‌భ‌లో ఫిరాయింపులు జ‌రిగిన‌ట్లుగా ఉంటే..వెంట‌నే అన‌ర్హ‌త వేటు వేయాలంటూ స‌భా నాయ‌కుడి హోదాలో ముఖ్య‌మంత్రి స‌భా వేదిక నుండే స్పీక‌ర్‌కు సూచించారు. ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చ‌ర్చకు కార‌ణ‌మైంది.

Recommended Video

చంద్రబాబుకు దక్కని కనీస గౌరవం
ఇబ్బంది ప‌డిన టీడీపీ..

ఇబ్బంది ప‌డిన టీడీపీ..

త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌లోభాల‌కు గురి చేసి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌టం పైన చాలా కాలంగా సీరియ‌స్‌గా ఉన్న జ‌గ‌న్‌..స‌భ వేదిక‌గానే టీడీపీని టార్గెట్ చేసారు. ముఖ్య‌మంత్రి మొద‌లు వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తంగా ఫిరాయింపుల పైనే ఎక్కువ‌గా మాట్లాడారు. చంద్ర‌బాబు గురించి..గ‌త స్పీక‌ర్ పైనా ఆరోప‌ణ‌లు చేస్తున్నా టీడీపీ నేత‌లు తిప్పికొట్ట‌లేక పోయారు. చంద్ర‌బాబు సైతం వైయ‌స్ 1978లో రెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. త‌న హ‌యాంలో జ‌రిగిన ఫిరాయింపుల మీద మాత్రం స‌మాధానం ఇవ్వ‌లేదు. ఇక‌,
టీడీపీ ఎమ్మెల్యేల ప‌రిస్థితీ అంతే. ఒక ర‌కంగా జ‌గ‌న్ ఆ అవకాశాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకున్నారు. ఒక వైపు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును దోషిగా చూపెడుతూనే..తాను ఎంత పార‌ద‌ర్శ‌కంగా..విలువ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న విష‌యాన్ని చెప్పుకోవ‌టానికి స‌భా వేదిక‌గా స్పీక‌ర్ ఎన్నిక సంద‌ర్బాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకున్నారు.

కేసీఆర్‌కు సైతం స‌వాల్‌గా...

కేసీఆర్‌కు సైతం స‌వాల్‌గా...

ఏపీ ముఖ్య‌మంత్రి ఫిరాయింపుల గురించి శాస‌న‌స‌భ‌లో చేసిన ప్ర‌సంగం..స్పీక‌ర్ చేసిన సూచ‌న ఇప్పుడు టీడీపీ అధి నేత చంద్ర‌బాబుకే కాదు..తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇబ్బంది క‌ర‌మే. ఇప్పుడు ఇద్ద‌రు తెలుగు సీఎంలు ఒక్క‌టిగా ఉంటున్నారు. ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అంది పుచ్చుకొనే దిశ‌గా వెళ్తున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మందిని టీఆర్‌య‌స్‌లోకి చేర్చుకొని టీఆర్‌య‌స్‌లో విలీనం కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం హైకోర్టు వ‌ర‌కు వెళ్లింది. స్పీక‌ర్‌తో స‌హా ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ అయ్యాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఏపీ శాస‌న‌స‌భా తొలి స‌మావేశాల్లోనే ఫిరాయింపుల‌కు తాను పాల్ప‌డ‌న‌ని.. ఎవ‌రైనా రాజీనామా చేసి రావాల్సిందేనంటూ.. ఫిరాయింపులు జ‌రిగితే అన‌ర్హ‌త వేటు వేయాంటూ జ‌గ‌న్ శాన‌స‌భా వేదిక‌గా సూచించారు. దీంతో ఇది ఇప్పుడు ఏపీతో పాటుగా తెలంగాణాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

English summary
AP CM jagan announcement on anti defections in AP is now became more hot topic in AP And Telangana. Jagan decision is not only related with Chandra babu and also for Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X