వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరిగి అధికారం దక్కటమే మైలురాయి: వైయస్ చెప్పిన చోట నుండే రచ్చబండ: సీఎం జగన్ కీలక ఆదేశాలు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్దిక సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొన్నారు. అనవసర వ్యయాన్ని తగ్గించడానికి అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. మేనిఫెస్టో అందరి వద్దా ఉండాలని.. నవరత్నాల అమలే ప్రభుత్వానికి ఉన్న ఫోకస్ అని సీఎం స్పష్టం చేసారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరాల్సిందేనన్నారు.
అదే విధంగా జనవరి..ఫిబ్రవరిలో రచ్చబండ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావడం అన్నదే పాలనకు ఒక మైలు రాయిగా నిలుస్తుందన్నారు. విశ్వసనీయత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వీడ కుండా ప్రతీ క్షణం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

సీఎం జగన్..ఎంపీ రఘురామ రాజు మధ్యలో పవన్ కళ్యాణ్..! ఢిల్లీలో ఏం జరిగింది...!సీఎం జగన్..ఎంపీ రఘురామ రాజు మధ్యలో పవన్ కళ్యాణ్..! ఢిల్లీలో ఏం జరిగింది...!

తిరిగి అధికారం దక్కటమే మైలురాయి

తిరిగి అధికారం దక్కటమే మైలురాయి

అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం పైనే ఫోకస్ పెట్టామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్వులు..విభాగాధిపతులతో సీఎం సమావేశమయ్యారు. ఆ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని వివరించారు. గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టిందని చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టిపెట్టామని..అనవసర వ్యయాన్ని తగ్గించడానికి అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావడం అన్నదే ఒక మైలు రాయి..అంటూ జగన్ అసలు లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ప్రజల ఆశలు.. ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే ఇది జరుగుతుందని తేల్చి చెప్పారు.

నవరత్నాల పైనే ప్రభుత్వ ఫోకస్..

నవరత్నాల పైనే ప్రభుత్వ ఫోకస్..

ప్రజలకు అవసరమైన ప్రాధాన్య అంశాలపై దృష్టిపెట్టాలని.. ఫోకస్‌గా ముందుకు వెళ్లాలని సూచించారు. ఫోకస్‌ లేకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేసారు. ఈ ప్రభుత్వం ఏంచేసినా సంతృప్త స్థాయిలో చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని నిర్దేశించారు. సంతృప్తస్థాయిలో అమలు చేయడమే ప్రతి పథకానికీ ప్రమాణమని గుర్తించాలన్నారు. నిధులను అక్కడ కొంత.. ఇక్కడ కొంత ఖర్చు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదని..నవరత్నాల అమలే ఈ ప్రభుత్వానికున్న ఫోకస్‌ అని మరోసారి స్పష్టం చేసారు. మేనిఫెస్టో అందరి వద్దా ఉండాలని..మేనిఫెస్టో ద్వారా ప్రాధాన్యతలేంటో చెప్పామని గుర్తు చేసారు. 14 నెలలపాటు 3648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలనుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించి.. అధ్యయనం చేసి ఈ మేనిఫెస్టోను తయారుచేశామని వివరించారు. ఏసీ గదుల్లో ఉండి తయారు చేసింది కాదని గుర్తుంచుకోవాలన్నాు. ప్రతిహామీ కూడా ప్రజల వినతుల నుంచి.. క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితులనుంచి.. వెనకబడ్డ వర్గాల వేదన నుంచే వచ్చిందని చెప్పుకొచ్చారు.

భారం లేకుండా ఆదాయం పెంచుకోవాలి..

భారం లేకుండా ఆదాయం పెంచుకోవాలి..

సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలమో ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఢిల్లీలో ఉన్న మన అధికారులను బాగా వినియోగించుకోవాలన్నారు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధుల్ని తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుతమిచ్చే హామీనే అని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాల పర్యటనల సందర్భంగా తాను ఇచ్చే హామీల అమలుపై దృష్టిపెట్టాలన్నారు. వచ్చే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా తాను ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలని ఆదేశించారు. ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలని నిర్దేశించారు.

 వైయస్ చెప్పిన చోట నుండే రచ్చబండ..

వైయస్ చెప్పిన చోట నుండే రచ్చబండ..

ముఖ్యమంత్రి జగన్ రచ్చబండ నిర్వహణ మీద నిర్ణయం తీసుకున్నారు. జనవరి - ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. వైయస్ రచ్చబండ కోసం పయణమై..ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో..అక్కడి నుండే రచ్చబండ ప్రారంభించనున్నారు. ఈసందర్బంగా ప్రజలనుంచే వచ్చే వినతులపైన హామీలు ఇస్తామని..ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలని నిర్దేశించారు. మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి.. ఎలాంటి తాత్సారం చేయకూడదన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చినమాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదని సీఎం తేల్చి చెప్పారు. విశ్వసనీయత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని..దీనికోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

English summary
AP CM Jagan directed official to implement every assurance given to public in all aspects. CM decided to ocnduct Rachabanda from january.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X