జ‌గ‌న్ అసెంబ్లీ టీం ఇదే: చీఫ్ విప్‌గా శ్రీకాంత‌రెడ్డి : విప్‌లుగా మ‌రో అయిదుగురు..!

Recommended Video

    జ‌గ‌న్ అసెంబ్లీ టీం ఇదే.. చీఫ్ విప్‌గా శ్రీకాంత‌రెడ్డి..!! || Oneindia Telugu

    త‌న కేబినెట్ ఏర్పాటు చేసుకున్న సీఎం జ‌గన్‌..ఇప్పుడు అసెంబ్లీ టీంను ప్ర‌క‌టించారు. మంత్రి ప‌ద‌వులు ఆశించి.. ద‌క్క‌ని సీనియ‌ర్ల‌ను చీఫ్ విప్..విప్‌లుగా నియ‌మించారు. ఈ నెల‌12 నుండి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక చీఫ్ విప్‌తో పాటుగా మ‌రో అయిదుగురు విప్‌ల‌ను ఖ‌రారు చేసారు. సామాజిక స‌మీక‌ర‌ణాలను దృష్టిలో ఉంచుకొని వీరిని ప్ర‌క‌టించారు. చీఫ్ విప్‌గా క‌డ‌ప జిల్లాకు చెందిన ముఖ్య‌మంత్రి స‌న్నిహితుడు రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు.

    చీఫ్ విప్‌..విప్‌లు ప్ర‌క‌ట‌న‌..
    కేబినెట్ కూర్పు పూర్తి కావటంతో అసెంబ్లీ టీంను సైతం జ‌గ‌న్ సిద్దం చేసారు. మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేక పోయిన త‌న సన్నిహితుల‌కు విప్‌లుగా అవ‌కాశం ఇచ్చారు. చీఫ్ విప్‌గా క‌డ‌ప జిల్లా రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అప్ప‌గించారు, ఆయ‌న తొలి నుండి జ‌గ‌న్‌తోనే ఉంటున్నారు. అదే విధంగా విప్‌లుగా అయిదుగురిని ఖ‌రారు చేసారు. అందులో మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారికే ప్రాధాన్య‌త ఇచ్చారు. వారిలో కృష్ణా జిల్లాకు చెంద‌ని బీసీ నేత పార్ధ‌సార‌ధి ఉన్నారు. ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించారు. అయితే అదే సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్ కుమార్ యాద‌వ్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టంతో పార్ధ‌సార‌ధికి అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇక‌, తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన కాపు వ‌ర్గానికి చెందిన దాటిశెట్టి రాజాకు సైతం విప్‌గా నియ‌మించారు. అదే జిల్లా నుండి క‌న్న‌బాబుకు మంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌టంతో రాజాకు కేబినెట్‌లో స్థానం ద‌క్క లేదు. ఇక‌, విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు.. క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే జ‌గ‌న్ స‌న్నిహితుడు అయిన కోరుముట్ల శ్రీనివాసులు..చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డికి సైతం విప్‌లుగా అవ‌కాశం ఇచ్చారు.

    AP Cm Jagan finalised Assembly whips. He appointed G Srikanth reddy as Chief Whip and another five whips

    ప్రాటెం స్పీక‌ర్‌గా శంబంగి..
    తొలి శాస‌న‌స‌భా స‌మావేశాల నిర్వ‌హ‌ణ కోసం ప్రొటెం స్పీక‌ర్‌ను ఖ‌రారు చేసారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్ప‌ల‌నాయుడు ప్రొటెం స్పీక‌ర్‌గా నియమితుల‌య్యారు. ఆయ‌న‌తో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్రొటెం స్పీక‌ర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆయ‌న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో టీడీపీ ఏర్పాటు నుండి ఆయ‌న పార్టీలోనే ఉన్నారు. టీడీపీ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌రువాత కాంగ్రెస్‌లో చేరి.. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ నుండి బొబ్బొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నెల 12 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో స‌భ్యుల‌తో ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు. 13న కొత్త స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారం బాధ్య‌త‌లు స్వీక‌రించే వ‌ర‌కూ శంబంగి ప్రొటెం స్పీక‌ర్‌గా కొన‌సాగుతారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+