ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను ప్రభుత్వం చెల్లించనుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ నెల జీతంతో కూడిన ఒక డీఏ, జులై నెల జీతంతో కూడిన మరో డీఏ ఇవ్వనుంది ఏపీ సర్కారు. రెండు డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కార్మికులపై కేసులు ఎత్తివేత
సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డీజీపీకి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి లేఖ రాశారు. ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications