• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా .. అమిత్ షా తో అపాయింట్మెంట్ క్యాన్సిల్ .. ఎందుకంటే

|

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం పలు అంశాలపై అమిత్ షా తో చర్చించాలని భావించారు. గత వారం ఢిల్లీ వెళ్ళిన సీఎం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ఏపీ కోసం వినతులను ఆయనకు చెప్పి వచ్చారు. కానీ అప్పుడు సైతం అమిత్ షా ను కలవలేకపోయారు. ఇప్పుడు మరోమారు అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.

వైఎస్ జగన్ బాటలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్: పీపీఏలను రద్దు: నోరెత్తని కేంద్రం

మహారాష్ట్ర ఎన్నికల హడావిడిలో అమిత్ షా ఉన్న నేపథ్యంలో జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం వీలుపడదని హోంశాఖ కార్యాలయం నుంచి సమాచారం అందడంతో జగన్ పర్యటన రద్దయింది. గతంలో సైతం అమిత్ షా తో భేటీ అపాయింట్మెంట్ దొరక్క రద్దయిన పరిస్థితి. ఇక ఇప్పుడు సైతం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరగాల్సిన వైఎస్ జగన్ భేటీ మరోసారి రద్దయింది. జగన్ కు ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా కార్యాలయం నుంచి జగన్ కు సమాచారం అందింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం.

AP CM Jagan postpone trip to Delhi .. appointment cancelled with Amit Shah

మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారం అయిపోయేంత వరకూ అమిత్ షా బిజీగా ఉంటారని, ఎవరికీ విడిగా అపాయింట్లు ఇచ్చే పరిస్థితి లేదని హోమ్ శాఖ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలి కాలంలో అమిత్, జగన్ ల భేటీ రద్దు కావడం ఇది రెండోసారి. గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీని కలిసిన జగన్, హోమ్ మంత్రిని మాత్రం కలవలేకపోయారు. ఇప్పుడు మరోసారి ప్రయత్నం చేసి అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడంతో కలవలేక పోతున్నారు. ఎన్నికల సమయం కావడంతో అమిత్ షా బిజీగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.

English summary
This is the second time Amith shah and Jagan's visit has been canceled in the recent days. Jagan, who met Modi as part of his visit to Delhi last week, could not meet the Home Minister. Now tried again and can not meet while the appointment is cancelled. It seems Amit Shah has been busy with election time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more