కేసీఆర్ ఓటమిని జగన్ ముందే ఊహించారా..? అందుకే కీలక అనుచరుడును కాంగ్రెస్‌లోకి పంపించారా..?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. సులువుగా మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ పార్టీ దాటేలా కనిపిస్తుంది. ఆ పార్టీ అభ్యర్థులు 65కు స్థానాలకు పైగానే అధిక్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. దీంతో తెలంగాణలో అధికారం చేపట్టడానికి ఆ సిద్ధం అవుతుంది.

కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకులు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మూడోసారి విజయం ఖాయం అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే ఇచ్చారు ఓటర్లు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Ap cm jagan predict KCR defeat before election ?

ఇదిలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఏపీ సీఎం జగన్ ముందే ఊహించారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసే ..జగన్ తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ తెలంగాణలోని తన కీలక అనుచరుడైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జగన్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని అంటున్నారు.

ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే ఏపీ సీఎం జగన్‌తో భేటీ అవ్వడమే దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. జగన్ సూచనతోనే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని వీడినట్టు సమాచారం. పొంగులేటితో పాటు వెంట ఆయన అనుచరులు, అభిమానులు భారీగా సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

దీనికి తోడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి తన అనుచరులకు టిక్కెట్లు ఇప్పించడమే కాకుండా , వారిని గెలిపించే పూర్తి బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా మొత్తం పొంగులేటి హవానే కనిపించింది. జిల్లాలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్‌కు దక్కనివ్వనని చెప్పి ..ఆ శపథాన్ని నిలబెట్టుకున్నారాయన.

జగన్ సూచనతోనే పొంగులేటి ,ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.తెలంగాణలో అధికార పార్టీ ఓటమిని ముందే పసిగట్టిన జగన్ ..తన అనచరుడును కాంగ్రెస్ పార్టీలో చేర్పించి తద్వారా ఆయనకు విజయాన్ని అందించారు. మొత్తానికి కేసీఆర్ ఓటమిని ముందే ఊహించిన జగన్ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచరుడును పంపించారని రాజకీయ విశ్లేషకులు భవిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+