బాబుకు బొట్టుపెట్టి స్వాగతం: చిన్నారితో(పిక్చర్స్)

నెల్లూరు: జిల్లాలో వరి, నిమ్మ, ఆక్వా కల్చర్ ఆధారంగా నెల్లూరును పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నెల్లూరు వరికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, మొలగొలుసుల బియ్యం అంటే ఇష్టపడని వారుండరని చెప్పారు. శుక్రవారం ఆయన నెల్లూరు జిల్లాలో కోవూరు, వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలిలో జరిగిన జన్మభూమి- మా ఊరు గ్రామ సభల్లో దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించి వరాల జల్లు కురిపించారు.

ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధార పరిశ్రమలను నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేయడంతోపాటు పారిశ్రామికాభివృద్ధికి కృష్ణపట్నం ప్రాంతంలో కారిడార్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. వైజాగ్ నుండి చెన్నై, బెంగళూరు నుండి చెన్నైకు కృష్ణపట్నం పోర్టు మీదుగా, ఏర్పేడు నుంచి కృష్ణపట్నం పోర్టువరకు పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కృష్ణా మిగులు జలాలను నెల్లూరు జిల్లాలోని కండలేరు, సోమశిల, స్వర్ణముఖి, తెలుగుగంగ చేరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అక్టోబర్ 22వ తేదీ నాటికి రైతులు, డ్వాక్రా మహిళల రుణాల్లో 20 శాతం చెల్లిస్తామని, మిగిలిన 80 శాతం వివిధ దశల్లో చెల్లిస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాల్లో ఇంటికి ఒకరు చొప్పున సంఘంలో చేరాలని, ముఖ్యంగా పేదవారు డ్వాక్రా సంఘాల్లో చేరాలని వీరి ద్వారానే పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సాధారణ ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రానున్న ఏడాది కాలంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రం ఆదాయ వనరులు లేక ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆయా వర్గాల ప్రజలకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే కరెంట్ కష్టాలనుండి గట్టెక్కామని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ పొదుపు చర్యల వల్ల 2015 నాటికి 5వందల మెగావాట్ల విద్యుత్ పొందుతుందన్నారు.

రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించేందుకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల 16వందల ఎకరాల్లో 25 వందల మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. విద్యుత్ రంగంలో తాము ముందంజలో ఉండడాన్ని చూసి సహించలేక తెలంగాణ సిఎం కెసిఆర్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో కొందరు తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరారని, అయితే కొందరు పార్టీని వీడినందువల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

బాబుకు స్వాగతం

బాబుకు స్వాగతం

నెల్లూరు జిల్లాలో వరి, నిమ్మ, ఆక్వా కల్చర్ ఆధారంగా నెల్లూరును పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

బొట్టుపెట్టి..

బొట్టుపెట్టి..

వైజాగ్ నుండి చెన్నై, బెంగళూరు నుండి చెన్నైకు కృష్ణపట్నం పోర్టు మీదుగా, ఏర్పేడు నుంచి కృష్ణపట్నం పోర్టువరకు పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

హెలికాప్టర్ దిగుతూ..

హెలికాప్టర్ దిగుతూ..

శుక్రవారం ఆయన నెల్లూరు జిల్లాలో కోవూరు, వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలిలో జరిగిన జన్మభూమి- మా ఊరు గ్రామ సభల్లో దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించి వరాల జల్లు కురిపించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధార పరిశ్రమలను నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేయడంతోపాటు పారిశ్రామికాభివృద్ధికి కృష్ణపట్నం ప్రాంతంలో కారిడార్‌ను ఏర్పాటుచేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

వైజాగ్ నుండి చెన్నై, బెంగళూరు నుండి చెన్నైకు కృష్ణపట్నం పోర్టు మీదుగా, ఏర్పేడు నుంచి కృష్ణపట్నం పోర్టువరకు పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

కృష్ణా మిగులు జలాలను నెల్లూరు జిల్లాలోని కండలేరు, సోమశిల, స్వర్ణముఖి, తెలుగుగంగ చేరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

అక్టోబర్ 22వ తేదీ నాటికి రైతులు, డ్వాక్రా మహిళల రుణాల్లో 20 శాతం చెల్లిస్తామని, మిగిలిన 80 శాతం వివిధ దశల్లో చెల్లిస్తామని చెప్పారు.

హాజరైన మహిళలు

హాజరైన మహిళలు

డ్వాక్రా సంఘాల్లో ఇంటికి ఒకరు చొప్పున సంఘంలో చేరాలని, ముఖ్యంగా పేదవారు డ్వాక్రా సంఘాల్లో చేరాలని వీరి ద్వారానే పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సాధారణ ప్రజానీకం కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

రానున్న ఏడాది కాలంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రం ఆదాయ వనరులు లేక ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆయా వర్గాల ప్రజలకోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

తమ ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లోనే కరెంట్ కష్టాలనుండి గట్టెక్కామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ పొదుపు చర్యల వల్ల 2015 నాటికి 5వందల మెగావాట్ల విద్యుత్ పొందుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహించేందుకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల 16వందల ఎకరాల్లో 25 వందల మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విద్యుత్ రంగంలో తాము ముందంజలో ఉండడాన్ని చూసి సహించలేక తెలంగాణ సిఎం కెసిఆర్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో కొందరు తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరారని, అయితే కొందరు పార్టీని వీడినందువల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

వైజాగ్ నుండి చెన్నై, బెంగళూరు నుండి చెన్నైకు కృష్ణపట్నం పోర్టు మీదుగా, ఏర్పేడు నుంచి కృష్ణపట్నం పోర్టువరకు పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+