జగన్‌తో సెల్ఫీ కోసం ఏడో తరగతి విద్యార్థి సాహసం: ఆ తర్వాత ఏం జరిగిందంటే?
శ్రీకాకుళం: జిల్లాలోని పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే, ఈ సభలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్‌తో సెల్ఫీ దిగాలని పలాసకు చెందిన ఏడో తరగతి విద్యార్ధి టీ దిలీప్ సభా ప్రాంగణంలో బారికేడ్లుపై ఎక్కాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విద్యార్థిని వారించారు.
అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ అలాంటి ప్రమాదకర ప్రయత్నం చేయవద్దని ఆ విద్యార్థికి సూచించారు. ఆ తర్వాత విద్యార్ది దిలీప్‌తో సెల్ఫీ దిగి ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ ఘటన మొదట ఆందోళన కలిగించినా.. ఆ తర్వాత సీఎం జగన్ చర్యతో అక్కడున్నవారిని ఆకట్టుకుంది.

సిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ. 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్ గురువారం ప్రారంభింంచారు. అలాగే, రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైయస్సార్ జలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందన్నారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కేలేదని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందని సీఎం జగన్ విమర్శించారు.
మరోవైపు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పైనా సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తే అక్కడి స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని పవన్ కళ్యాణ్ పార్టీని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేసినా ప్రయోజనం ఉండదన్నారు.












Click it and Unblock the Notifications