వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఆర్సీ రిపోర్ట్ : 72 గంటల్లో సీఎం జగన్ తుది ప్రకటన-సీఎస్ సమీర్ శర్మ ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్న 11వ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇవాళ బయటపెట్టింది. ముఖ్యమంత్రి జగన్ కు అధికారుల కమిటీ నివేదిక సమర్పణ తర్వాత దీన్ని మీడియాకు విడుదల చేశారు. అలాగే ఆర్ధికశాఖ వెబ్ సైట్లోనూ ఉద్యోగులకు అందుబాటులో ఉంచారు. దీనిపై త్వరలో ఉద్యోగులతో చర్చించి తుది నివేదిక ఖరారు చేసే అవకాశముంది.

ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ నివేదికపై కార్యదర్శుల స్థాయి కమిటీ సిఫార్సులను ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధ్యక్షతన గల కమిటీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది. అనంతరం సచివాలయం సచివాలయానికి వచ్చిన సీఎస్ సమీర్‌ శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ పీఆర్సీపై చేసిన సిఫార్సులను మీడియాకు వివరించింది. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పిఆర్సీపై తుది నిర్ణయాన్ని మూడు రోజుల్లోగా అనగా 72 గంటల్లో ముఖ్యమంత్రి వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు.

ap cm ys jagan to made final announcement on prc in 72 hours, says chief secretary sameer sharma

పీఆర్సీపై అధికారులు కమిటీ సిఫార్సులను ఆర్ధికశాఖ వెబ్ సైట్ https://www.apfinance.gov.in/లో అందుబాటులో ఉంచుతామని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. దీనిపై ఉద్యోగులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులు తమతో చర్చించకుండా పీఆర్సీ ప్రకటించవద్దని కోరుతున్న నేపథ్యంలో సీఎం జగన్ వీరితో చర్చల తర్వాత ప్రకటన చేసే అవకాశముంది.

Recommended Video

Weather Forecast : New Low Pressure, Heavy Rains Again In AP & TS || Oneindia Telugu

ఇవాళ పీఆర్సీ నివేదిక ఇచ్చిన వారిలో సీఎస్ సమీర్ శర్మతో పాటు కార్యదర్శుల కమిటీ సభ్యులు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ,ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్,ఆర్ధికశాఖ,మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్,ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ తోపాటు ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి,సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

English summary
ap chief secetary sameer sharma on today annouced that cm jagan will made a statement on prc in 72 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X