మరో జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ సిద్ధం: రేపే టూర్

ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి ముహూర్తం కూడా కుదిరింది. తన పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. ఆ మరుసటి రోజే కర్నూలుకు వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాణ్యం శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు.

ఆ వెంటనే సొంత జిల్లా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో గడిపారు. కడప జిల్లా సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మించిన ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్‌ను ప్రారంభించారు. ఇడుపుల పాయ, పులివెందులల్లో పర్యటించారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్లొన్నారు. పులివెందులలోని చర్చ్‌లో క్రిస్మస్ ప్రార్థనలకు హాజరయ్యారు. అదే రోజు తాడేపల్లికి తిరిగివచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తేనీటి విందు ఇచ్చారు.

AP CM YS Jagan will tour in Prakasam district on December 26

ఒక్కరోజు వ్యవధి తరువాత మరో జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ దఫా ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారాయన. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఇది వ్యక్తిగత పర్యటన. జిల్లాాలోని యర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహం జరుగనుంది. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, హోం మంత్రి సుచరిత, తానేటి వనిత సహా పలువురు మంత్రులు ఇందులో పాల్గొననున్నారు.

ఉదయం 10.40 నిమిషాలకు వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 11.25 నిమిషాలకు యర్రగొండపాలెం చేరుకుంటారు. మార్కెట్‌ యార్డులో ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 11.35 నిమిషాలకు హెలీప్యాడ్‌ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులకు ఆయనకు స్వాగతం పలుకుతారు. 11.40 నిమిషాలకు పెళ్లిమండపానికి వస్తారు. వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+