ఎల్లుండి సెలవు.. ప్రభుత్వం జీవో విడుదల..
మహా శివరాత్రి పర్వదినం ఈ నెల 15(ఆదివారం) రోజు ఉంది. ఆ మరునాడు అంటే సోమవారం ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ జీవో విడుదల చేసింది. శివరాత్రి భక్తులు జాగారం చేయనున్న కారణంగా మరునాడు సెలవు తీసుకునేలా కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
ఇక హిందువులు పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. ఈ రోజును హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా చెబుతుంటారు. ఈ రోజున శివుడిని భక్తి, పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఫిబ్రవరి 15న వచ్చింది. శివరాత్రి రోజున రాత్రి జాగారం చేస్తుంటారు. అందువల్ల మరునాడు సెలవు తీసుకునేలా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
ఇక మహా శివరాత్రి రోజున శివానుగ్రహం పొందాలంటే.. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తలస్నానం ఆచరించి రోజంతా ఉపవాసం ఉండాలని పండితులు చెబుతున్నారు. అలాగే రాత్రంతా నిద్ర పోకుండా లింగోద్భవ కాల పూజలు, జాగరణ చేస్తూ శివనామస్మరణ చేయాలన్నారు. శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో పూజించడం, పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. రోజంతా భక్తితో గడపాలని చెబుతున్నారు.

ఇక ఈ సంవత్సరం ఈ లింగోద్భవ కాలం రాత్రి 12 గంటల 3 నిమిషాల 10 సెకన్ల నుంచి 12 గంటల 53 నిమిషాల 52 సెకన్ల వరకు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ పరమ పవిత్రమైన సమయంలో లింగ రూపంలో ఉన్న పరమేశ్వరునికి అభిషేకం జరిపించడం ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications