తెలంగాణ, బాబుపై గవర్నర్‌కు చిరంజీవి ఫిర్యాదు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధించిన ట్యాక్స్ పైన గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం చెప్పారు. ఏపీ కాంగ్రెస్ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, పళ్లం రాజు తదితరులు ఉదయం గవర్నర్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరువు, తెలంగాణ ట్యాక్స్ పైన ఫిర్యాదు చేసినట్లు చిరంజీవి చెప్పారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరామన్నారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ... టీడీపీ కేడర్ లేని గ్రామాలకు నీటిని సరఫరా చేయడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో కరువు మండలాల పైన నివేదిక ఇచ్చిందన్నారు. ఉపాధి హామీ పనులు సరిగా లేకపోవడంతో రాష్ట్రంలో వలసలు పెరిగాయన్నారు. కరువు బారిన పడిన ఏపీని కేంద్రం ఆదుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన రవాణా పన్ను వెంటనే రద్దు చేసుకోవాలన్నారు. జన్మభూమి కమిటీలలో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు.

లక్ష మందికి రిలీవ్ లేదు: లోకేష్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ హైదరాబాదులో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ ఉద్యోగం ఇప్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పని చేస్తుందన్నారు.
త్వరలో ప్రతి జిల్లాలో శిక్షణ కేంద్రం, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఏడాదికి రిలీవ్ అవుతున్న నాలుగు లక్షల మందిలో లక్ష మందికి ఉపాధి లేదని అన్నారు. ఏడాదికి కనీసం 50వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications