'వాస్తవ పత్రాలు'తో బాబుకు కౌంటర్, 3 నుండి టీ సెషన్స్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం, పారిశ్రామిక, విద్యుత్ రంగాల పైన వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వీటికి కౌంటర్‌గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ 'వాస్తవ పత్రాలు' విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో వాస్తవ పత్రాలు రూపు దిద్దుకుంటున్నాయట.

చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల పైన కాంగ్రెసు పార్టీ వారు ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు శ్వేతపత్రాల పేరుతో ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అవి శ్వేతపత్రాలు కాదని, తాము సరైన శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

AP Congress to counter Chandrababu's white papers

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్: యనమల

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం చెప్పారు. బడ్జెట్ రోజే దానిని కూడా ప్రవేశ పెడతామని చెప్పారు. రైతుల రుణ బకాయిలు చెల్లించేందుకు పదేళ్ల పాటు బ్యాంకులను గడువు కోరుతామని చెప్పారు. రైతుల రుణాలకు గ్యారంటీగా బ్యంకులకు మూడు రకాల సెక్యూరిటీలు సమర్పిస్తామన్నారు. బేవరేజెస్, ఇసుక, ఎర్రచందనం పైన వచ్చే ఆదాయాలను ఎస్క్రో అకౌంట్ల ద్వారా చూపిస్తామని వివరించారు.

వ్యవసాయానికి, బడ్జెట్ రోజే, పండింగి బిల్లులను దశలవారిగా చేల్లించాలని ఆదేశా, వాసత్తవాలు ప్రతిభింబించేలా ఆర్థిక సర్వే,

3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సెప్టెంబర్ 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10వ తేదీన తొలి ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+