AP Corona update : ఆ జిల్లాల్లో కరోనా విజృంభణ, తాజాగా 1869 కేసులు, 18 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కొనసాగుతుంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1869 కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలో విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ ఫైవ్ లో ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71030 శాంపిల్స్ ను పరీక్షించగా 1869 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 19, 87,051 కి చేరింది.
రాష్ట్రంలో 18,417 క్రియాశీల కేసులు
తాజాగా కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 18 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 13,582కి పెరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,417 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇదే సమయంలో గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నుండి 2,316 మంది బాధితులు కోలుకున్నట్లుగా సమాచారం. రోజువారి నమోదైన కేసుల కంటే, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 19,55,052 గా నమోదయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,53,82,763 నమూనాలను పరీక్షించినట్లు గా అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా తాజా పరిస్థితి ఇదే
కరోనా మృతుల్లో గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా చిత్తూరులో అత్యధికంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు గా సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 18 గా నమోదయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 385 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం జిల్లాలో 51 , చిత్తూరు జిల్లాలో 175, గుంటూరు జిల్లాలో 220 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 133 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 148 కేసులు, నెల్లూరు జిల్లాలో 177 కేసులు, ప్రకాశం జిల్లాలో 98 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 80 కేసులు, విశాఖపట్నంలో 63 కేసులు, విజయనగరంలో 21 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 304 కరోనా కొత్త కేసులు నమోదైన పరిస్థితి.
అత్యధికంగా కేసులు పెరుగుతున్న జిల్లాలు ఇవే
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు ఉన్న పరిస్థితి ఏపీ సర్కార్ కు ఆందోళనకరంగా మారింది. గత కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తరువాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది . తర్వాతి స్థానంలో చిత్తూరు, నెల్లూరు ఉన్నట్లుగా తాజా లెక్కల బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉంటే కరోనా కట్టడి కోసం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది.ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సైతం కొనసాగుతుంది.
వ్యాక్సినేషన్ పై ప్రధానంగా ఫోకస్ పెట్టమని చెప్పిన సీఎం జగన్
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో వ్యాక్సినేషన్ పై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని టీకాలు ఇవ్వాలని దీనివల్ల క్రమబద్ధంగా ప్రాధాన్యతా పరంగా వాక్సినేషన్ ఇచ్చినట్లు అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులతో పాటు పాఠశాలలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యతనివ్వాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications