ఏపీ కరోనా అప్‌డేట్ : స్పల్పంగా తగ్గిన కేసులు- 100కు తగ్గని మరణాలు
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులిటెన్‌లో నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గినా ఇంకా వైరస్ ప్రభావం మాత్రం వెంటాడుతూనే ఉంది. అలాగే మరణాల సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లోనే 30 మంది కరోనాతో చనిపోయారు.
ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 14429 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2291 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్ధానాల్లో తూర్పుగోదావరి 2022, అనంతపురం 1192, విశాఖపట్నం 1145, కృష్ణా 1092, కర్నూలు 1034 కేసులతో వెయ్యి కేసులు దాటిన జిల్లాల్లో ఉన్నాయి. అత్యల్ప కేసుల జాబితాలో విజయనగరం 535, కడప 578, గుంటూరు 798, ప్రకాశం 924, నెల్లూరు 930, పశ్చిమగోదావరి 991 కేసులున్నాయి.
వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 16.57 లక్షలకు చేరింది. ఇందులో 14.66 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 1.8 లక్షల మంది ఇంకా కోలుకుంటున్నారు.

Recommended Video
గత 24 గంటల్లో కరోనా మరణాలను గమనిస్తే 103 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇందులో చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తలో 15 మంది కరోనాతో చనిపోయారు. మిగిలిన జిల్లాల్లో విశాఖలో 10, నెల్లూరులో 9, అనంతపూర్‌లో 8, తూర్పుగోదావరిలో 8, కృష్ణాలో 8, గుంటూరులో ఏడుగురు, విజయనగరంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, కడపలో నలుగురు, కర్నూల్లో నలుగురు, ప్రకాశంలో ఇద్దరు చనిపోయారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 10634 మంది చనిపోయారు. గత 24 గంటల్లో ప్రభుత్వం 84502 శాంపిల్స్‌ను పరీక్షించింది.












Click it and Unblock the Notifications